Sep 25,2023 23:49

ఫ్యాప్టో ఆధ్వర్యంలో ధర్నా చేస్తున్న ఉపాధ్యాయులు

ఫ్యాప్టో ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ వద్ద ధర్నా
ప్రజాశక్తి - అమలాపురం
రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు సిపిఎస్‌ను అమలు చేయాలని ఫ్యాప్టో ఆధ్వర్యంలో చలో కలెక్టరేట్‌లో భాగంగా జిల్లాలోని ఉపాధ్యాయులు, ఉద్యోగులు కలెక్టరేట్‌ వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. సిపిఎస్‌ను అమలు చేయాలని, ఒపిఎస్‌ వద్దని, జిపిఎస్‌ను రద్దు చేయాలని నినదించారు. ఫ్యాప్టో జిల్లా చైర్మన్‌ నాగిరెడ్డి శివప్రసాద్‌, ఫ్యాప్టో జనరల్‌ సెక్రటరీ పెయ్యల వీరభద్రరావు, ఫ్యాప్టో సెక్రటరీ జనరల్‌ పెంకె వెంకటేశ్వరరావు, ఎపిసిపిఎస్‌ఇఎ నాయకులు కృష్ణ, రవికుమార్‌ ఆధ్వర్యంలో ఈ ధర్నాను చేపట్టారు. ఈ సందర్భంగా ఫ్యాప్టో జిల్లా చైర్మన్‌ నాగిరెడ్డి శివప్రసాద్‌ మాట్లాడుతూ సిపిఎస్‌ను తక్షణమే రద్దుచేసి పాత పెన్షస్‌ విధానాన్ని పునరుద్ధరించాలన్నారు. ఒపిఎస్‌ తప్ప తమకు ఏదీ ఆమోదయోగ్యం కాదన్నారు. ఫ్యాప్టో జిల్లా సెక్రెటరీ జనరల్‌ వీరభద్రరావు మాట్లాడుతూ జిపిఎస్‌ను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. డిప్యూటీ సెక్రటరీ జనరల్‌ పెంకే వెంకటేశ్వర రావు మాట్లాడుతూ జిపిఎస్‌తో ఉద్యోగుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టడం దారుణమన్నారు. ఈ ధర్నాలో పి.దొరబాబు, ఎస్‌.జ్యోతిబసు, ఎన్‌.సత్య నారాయణ, ఉండవల్లి సత్యనారాయణ, పినిపే మురుగేశ్వరరావు, సరిదే సత్యపల్లంరాజు, చంద్రకళ, మేరీ రుత్‌, డి.వెంకటలక్ష్మి, రత్నకుకూరి, నాయకుల యల్లేశ్వరరావు తదితర నాయకులు పాల్గొన్నారు.