ప్రజాశక్తి-అమలాపురం
డాక్టర్ బిఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఒపిఎస్ సాధనకు యుటిఎఫ్ జిల్లా నాయకుల ఆధ్వర్యంలో గురువారం నిరసన దీక్ష శిబిరం నిర్వహించారు. దీనిని వ్యవసాయ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కారెం వెంకటేశ్వరరావు ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ సిఎం జగన్ ప్రతిపక్ష హోదాలో పాదయాత్ర చేసిన సందర్భంలో ప్రతిచోట అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సి పి ఎస్ రద్దు చేస్తామని చెప్పారన్నారు. అయితే సిపిఎస్ కంటే అన్యాయమైన జిపిఎస్‌ని తీసుకొని ఈ రాష్ట్ర ఉపాధ్యాయులకు ఉద్యోగులను మోసగించారని, అలాంటి ముఖ్యమంత్రికి వచ్చే ఎన్నికల్లో బుద్ది చెప్పాలని ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు పెంకె వెంకటేశ్వరరావు, జిల్లా కార్యదర్శులు కేశవరావు రమణ మురుగేశ్వరావు, శివకుమార్ లతో సహా 20 మంది దీక్షలో పొల్గున్నారు. మరొక 34 మంది మద్దతుగా శిబిరంలో కూర్చొన్నారు. వెంకటేశ్వరావు మాట్లాడుతూ ఉపాధ్యాయుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వం ప్రతీ సందర్భంలోను ఉపాధ్యాయులను మోసగిస్తుందని సరియైన సందర్భంలో సరియైన సమాధానం చెబుతామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి జ్యోతిబసు మాట్లాడుతూ జిపిఎస్ రద్దు ఒపిఎస్ 18న రాష్ట్ర కేంద్రంలో ప్రారంబించబడిన అమరణ దీక్షకు ముద్దత్తుగా గురువారం 19న జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద 20, 21వ తేదీల్లో పాత తాలుక కేంద్రాల్లో ఈ నిరసన దీక్షలు కొనసాగిస్తామన్నారు. ప్రభుత్యం స్పందించి జిపిఎస్ ను రద్దు పరచాలన్నారు. ఐదు రాష్ట్రాల్లో సిపిఎస్ ను రద్దు పరచగా హామ ఇచ్చిన సిఎం జిపిఎస్ ను తీసుకొని రావడం మోసగించడమే అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సురేంద్ర మమార్, మురళి మోహన్, దుర్గా ప్రసాద్,సత్యనారాయణ, సురేశ్ కుమార్, శ్రీనివాసరావు, సురేష్. రాంబాబు, చంద్ర కళ, ప్రసన్న కుమారి,మహలక్ష్మి, బిఎన్. వెంకటేశ్వర రావు,రమణ, చంద్రరావు మొదలగువారు పాల్గోన్నారు.










