
యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి గోపీమూర్తి
ప్రజాశక్తి - పెనుమంట్ర
సిపిఎస్ రద్దు చేసి ఒపిఎస్ అమలు చేస్తానని సిఎం జగన్ ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీని నెరవేర్చేవరకూ పోరాటం చేస్తామని ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర కోశాధికారి బి.గోపీమూర్తి తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలను సంరక్షించే విధానాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించాలని డిమాండ్ చేశారు. యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి ఎం.శ్రీనుబాబు అధ్యక్షతన మార్టేరు డివిజన్ సమావేశం బుధవారం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా రాష్ట్ర కోశాధికారి బి.గోపీమూర్తి, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి.విజయరామరాజు, ఎకెవి.రామభద్రం హాజరయ్యారు. గోపీమూర్తి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పాఠశాలల విలీనం చేయడంతో వేలాది పాఠశాలలు మూత పడుతు న్నాయన్నారు. దీంతో ప్రభుత్వ విద్యారంగం తీవ్ర సంక్షోభానికి గురవుతుం దని, బడి ఈడు పిల్లలు ప్రభుత్వ పాఠశాలలకు దూరమవుతున్నారని చెప్పారు. సిపిఎస్ రద్దు చేసి ఒపిఎస్ అమలు చేస్తానని ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీని నెరవేర్చాలన్నారు. ఒపిఎస్ అమలు చేసేవరకూ పోరాటం చేస్తామని తెలిపారు.