Nov 05,2023 21:46

సమావేశంలో పాల్గొన్న నాయకులు

ప్రజాశక్తి -పెనుకొండ :ఒపిఎస్‌ను పునరుద్ధరించే పార్టీలకే రాబోయే ఎన్నికల్లో ఉద్యోగ, ఉపాధ్యాయుల మద్దతు ఉంటుందని యుటి ఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.సుధాకర్‌ స్పష్టం చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయులను మోసం చేసిన వైసిపి ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తూ ఆదివారం యుటిఎఫ్‌ పెనుకొండ డివిజన్‌ శాఖ ఆధ్వర్యంలో స్థానిక రవీంద్ర భారతి స్కూల్‌ ఆవరణలోని ఎంఎస్‌ఆర్‌ రెసిడెన్సీలో మండల కౌన్సిల్‌ సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన సుధాకర్‌ మాట్లాడుతూ సిఎం జగన్‌ నేటికీ ఒపిఎస్‌ను అమలు చేయక పోగా జిపిఎస్‌ విధానం తీసుకురావడం సమంజసం కాదన్నారు. 'ఓట్‌ ఫర్‌ ఒపిఎస్‌' నినాదంతో ముందుకెళ్తామన్నారు. ఏ రాజకీయ పార్టీ ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరిస్తుందో, జిపిఎస్‌ను రద్దు చేసి ఒపిఎసన్‌ను పునరుద్ధ్దరిస్తుందో ఆ పార్టీకే 2024 సార్వత్రిక ఎన్నికల్లో మద్దతిస్తామని తెలిపారు. అనంతరం జిల్లా కార్యదర్శి నారాయణస్వామి అధ్యక్షతన మండల కమిటీ గౌరవాధ్యక్షులుగా పి.కృష్ణనాయక్‌, అధ్యక్షులుగా యుపి.ఉపేంద్ర, ప్రధాన కార్యదర్శిగా రమేష్‌, సహాధ్యక్షులుగా వి.రామాంజనేయు లు, ఎం.నాగమణి, కోశాధికారిగా ఆదిజినేష్‌లను ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. కార్యక్రమంలో పెనుకొండ, రొద్దం, సోమందేపల్లి మండలాల యుటిఎఫ్‌ నాయకులు రవీంద్ర, నరసింహుడు, హసీనాబేగం, రాధామణి, బాబు, నరేష్‌, నాగేంద్ర, నరేష్‌, మారుతి, శేషాద్రి, దేవీ, గౌరమ్మ, రామకృష్ణనాయక్‌, లక్ష్మానాయక్‌, ఓబిలేసు, సోమశేఖర్‌, తదితరులు పాల్గొన్నారు.