ప్రజాశక్తి - ఆరిలోవ : జివిఎంసి 13వ వార్డు పరిధి స్కిల్ డెవలెప్‌మెంట్ ఇనిస్టిట్యూట్ వద్ద బహిరంగ జిమ్‌కు వార్డు కార్పొరేటర్ కెల్ల సునీత శనివారం శంకుస్థాపన చేశారు. వార్డు పరిధి ఆపరేషన్ కాలనీ, శ్రీకాంత్‌నగర్‌లోని వరల్డ్ విజన్ ఎంపిపి స్కూల్లో మరమ్మత్తు పనులకు ఆమె శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఆపరేషన్ కాలనీ ఎంపిపి స్కూల్లో వంట గది నిర్మాణం, తాగు నీటి సదుపాయం, బాత్ రూమ్‌లు, ప్రహరీ నిర్మాణానికి రూ.19 లక్షలు, శ్రీకాంత్‌నగర్‌లో ఎంపిపి స్కూల్లో రూ.44 లక్షల వ్యయంతో అదనపు తరగతుల నిర్మాణం, బాత్ రూమ్‌లు, తాగు నీరు సదుపాయాలకు ఖర్చు చేయనున్నట్టు తెలిపారు. ముడసర్లోవ వాకర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి మేరకు అదనంగా మరో ఒపెన్ జిమ్ ఏర్పాటుకు మేయర్ గొలగాని హరి వెంకట కుమారి దృష్టికి తీసుకుకెళ్లామని, ఆమె స్పందించి మంజూరు చేశారని చెప్పారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ సభ్యులు రాజబాబు, మోహన్‌రావు, వైసిపి నాయకులు బేత దుర్గారావు, పిల్లి వీర్రాజు, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.










