Aug 28,2022 23:14

ఓపెన్‌ జిమ్‌ను ప్రారంభిస్తున్న మేయర్‌ హరి వెంకట కుమారి

ప్రజాశక్తి - ఆరిలోవ : ముడసర్లోవ వాకర్స్‌ అసోసియేషన్‌ విజ్ఞప్తి మేరకు 13వ వార్డు కార్పొరేటర్‌ కెల్ల సునీత చొరవతో ముడసర్లోవ రోడ్డులోని స్కిల్‌ డెవలెప్‌మెంట్‌ సెంటర్‌ సమీపంలో ఓపెన్‌ జిమ్‌ను మేయర్‌ గొలగాని హరివెంకటకుమారి ఆదివారం ప్రారంభించారు. ముడసర్లోవ వాకర్స్‌ అసోసియేషన్‌ వార్షికోత్సవాన్ని స్కిల్‌ డెవలెప్‌మెంట్‌ సెంటర్‌ వద్ద ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మేయర్‌తోపాటు 13వ వార్డు కార్పొరేటర్‌ కెల్ల సునీత హాజరయ్యారు. ఈ సందర్భంగా మేయర్‌ మాట్లాడుతూ, ముడసర్లోవ వాకర్స్‌ అసోసియేషన్‌ చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమన్నారు. వార్డు కార్పొరేటర్‌ కెల్ల సునీత మట్లాడుతూ, వార్డులో అదనంగా మరో ఓపెన్‌ జిమ్‌ను ఏర్పాటుచేసినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జోనల్‌ కమిషనర్‌ బి.రాము, వైసిపి నాయకులు గొలగాని శ్రీనివాసరావు, కెల్ల సత్యనారాయణ, పిల్లి వీర్రాజు, బేత దుర్గారావు, వెంకటరెడ్డి, ముడసర్లోవ వాకర్స్‌ అసోసియేషన్‌ సభ్యులు పాల్గొన్నారు.