ప్రజాశక్తి-కోట : కోట గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో సోమవారం ఉదయం పాము కాటుకు గురైన ఒక యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది.అతని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రిలోని మార్చురీ గదిలో ఉంచారు. ఆస్పత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగింది.వివరాల్లోకి వెళ్ళితే ఓజిలి మండలం ఆచార్య పార్లపల్లి గ్రామానికి చెందిన తడపల.రవి(45)అనే సంవత్సరాల వయస్సు కలిగిన వ్యక్తి కోట మండల పరిధిలోని తిమ్మనాయుడు పాళెం గ్రామ సమీపంలో ఓ ఇటుక బట్టీల వద్ద పనిచేస్తున్నాడు.అతనికి వివాహమైంది భార్య సుబ్బమ్మ, నలుగురు పిల్లలు ఉన్నారు.వారిలో ముగ్గురు కుమార్తెలు మమత-13, హారిక -4,హేమలత-3,ఒక కుమారుడు సురేష్-7లు ఉన్నారు. అయితే సోమవారం ఉదయం తెల్లవారుజామున సుమారు నాలుగు గంటల సమయంలో రవిని ఇటుక బట్టీల సమీపంలో పాము కాటేసింది. అతనిని చికిత్స నిమిత్తం కోట పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లగా అత్యవసర చికిత్స నిమిత్తం అతనిని గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం గూడూరులో అతను చికిత్స పొందుతూ మరణించినట్లు కుటుంబసభ్యులు తెలియజేశారు.










