Oct 05,2023 21:10

ఎస్‌కోట: గుండిగీయించుకుని నిరసన తెలుపుతున్న నాయకులు

ప్రజాశక్తి- మెంటాడ : మండలంలోని బుచ్చిరాజుపేటలో గురువారం టిడిపి పోలిట్‌ బ్యూరో సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి ఆధ్వర్యంలో జరిగిన టిడిపి దీక్షల్లో ఒంటికాళ్లపై నిరసన తెలిపారు. టిడిపి మండల అధ్యక్షుడు చలుమూరి వెంకటరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి గెద్ధ అన్నవరం, రెడ్డి రాజగోపాల్‌, సిరిపురం గురునాయుడు, గుమ్మడి సింహాచలం, కొరిపిల్లి చిన్నం నాయుడు, గెద్ధ కాశినాయుడు తదితరులు పాల్గొన్నారు.
అరగుండుతో నిరసన
శృంగవరపుకోట: పట్టణంలోని ఆకుల డిపో వద్ద గురువారం టిడిపి రాష్ట్ర కార్యదర్శి గొంప కృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన రిలే నిరాహార దీక్షలో బీసీ సాధకారిత యాత విభాగం డైరెక్టర్‌ సిమ్మ అప్పారావు, సీనియర్‌ కార్యకర్త కిషోర్‌లు పాల్గొని అరగుండుతో నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్థాయి, టిడిపి విశాఖ పార్లమెంటరీ, నియోజకవర్గ పరిధిలో ఉన్న టిడిపి నాయకులు, ఐదు మండలాల పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శలు తదితరులు పాల్గొన్నారు.
పూసపాటిరేగ: మండలంలోని బర్రిపేట తీరంలో టిడిపి మండల అధ్యక్షలు మహంతి శంకరావు ఆధ్వర్యంలో టిడిపి నాయకులు గురువారం సముద్రంలో దిగి వినూత్న నిరసన తెలిపారు. అనంతరం సముద్ర తీరంలో ఐ యామ్‌ విత్‌ సిబిఎన్‌ అనే పేరుతో ఇసుకతో చెక్కిన సైకత శిల్పం వద్ద మోకాల్లపై కూర్చొని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నియోజకవర్గ ఇంఛార్జి కర్రోతు బంగార్రాజు, సీనియర్‌ నాయకులు మహంతి చిన్నంనాయుడు, కంది చంద్రశేఖర్‌, కర్రోతు సత్యనారాయణ, సువ్వాడ రవిశేఖర్‌, పతివాడ అప్పలనా రాయణ, పల్లె బాస్కరావు, గేదెల రాజారావు, ఆకిరి ప్రసాదరావు, దంతులూరి సూర్యనారాయణ మూర్తిరాజు, పిన్నింటి శ్రీనువాసరావు, ఇజ్జురౌతు ఈశ్వర్రావు, బొంతు రవి, మైలపల్లి సింహచలం, లంకలపల్లి శ్రీనువాసరావు, ఇనుగంటి రాకేష్‌శర్మ, ఇనపకుర్తి శ్రీనువాసరావు, లంకలపల్లి డాక్టర్‌, మద్దిల మురళీ, బర్రి నూకరాజు తదితరులు పాల్గొన్నారు.