ప్రజాశక్తి-విజయనగరంకోట : రాష్ట్రానికి పట్టిన దరిద్రం పోవాలని ఒంటికాలిపై రాష్ట్రవ్యాప్తంగా సైకియాత్ర చేస్తున్న ఏలూరు జిల్లా కైకలూరుకు చెందిన పోతుల రాఘవేంద్ర బుధవారం విజయనగరం చేరుకున్నాడు. అశోక్‌బంగ్లాకు చేరుకున్న అతడు టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు పూసపాటి అశోక్ గజపతిరాజును కలిశారు. ఈనెల 7న కైకలూరు హరిజనవాడ రోడ్డు నుంచి యాత్రకు బయలుదేరినట్లు తెలిపాడు. సైకిల్‌కు తెలుగుదేశం, జనసేన జెండాలు కట్టుకొని భీమవరం, నరసాపురం, అంతర్వేది, అప్పన్నపల్లి, అమలాపురం, పిఠాపురం, పెద్దాపురం, కాకినాడ, అన్నవరం మీదుగా విజయనగరం చేరుకున్నట్లు తెలిపాడు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవిపి రాజు, నగర అధ్యక్షులు ప్రసాదుల లక్ష్మీ వరప్రసాద్, మండల పార్టీ అధ్యక్షులు బొద్దల నర్సింగరావు, కార్యదర్శి బంగారు బాబు, కోండ్రు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.