Feb 18,2023 18:01

ఓంకారంలో ఎద్దుల బల ప్రదర్శన పోటీలను ప్రారంభిస్తున్న దృశ్యం


ఓంకారంలో ఎద్దుల బల ప్రదర్శన
ప్రజాశక్తి - బండి ఆత్మకూర్‌

మహాశివరాత్రి పండుగ సందర్భంగా ఓంకార పుణ్యక్షేత్రంలో శనివారం 4 పండ్ల ఎద్దుల బల ప్రదర్శన పోటీలను ఓంకార క్షేత్ర చైర్మన్‌ అన్నెం విశ్వనాథరెడ్డి, మండల ప్రజా పరిషత్‌ అధ్యక్షులు దేరెడ్డి చిన్న సంజీవరెడ్డి, వైకాపా మండల కన్వీనర్‌ బారెడ్డి శ్రీనివాస్‌ రెడ్డి ఆధ్వర్యంలో వైభవంగా ప్రారంభించారు. ఎద్దుల బలప్రదర్శన పోటీలను తిలకించేం దుకు జిల్లాలోని రైతు సోదరులు మండలంలోని రైతులు పెద్ద ఎత్తున పాల్గొని రైతు పండుగ ఉత్సవాలను వైభవంగా నిర్వహించారు. మొదటి బహుమతి విజేతలకు రూ.30000, రెండు, మూడు, నాలుగు, ఐదు వరకు బహు మతులు ఇవ్వడం జరుగుతుందని ఎద్దుల బలప్రదర్శన పోటీ నిర్వహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పిట్టం పెద్ద రామసుబ్బారెడ్డి, దే రెడ్డి అయ్యప్ప రెడ్డి, పిట్టం నాగేంద్రారెడ్డి, లింగాల శేఖర్‌, జిసి పాలెం బలరాం రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.