
ప్రజాశక్తి-నెల్లిమర్ల : మండలంలోని ఒమ్మి గ్రామంలో టిడిపి ఆధ్వర్యాన 'బాబుతో నేను' కార్యక్రమం శుక్రవారం రాత్రి జరిగింది. మండల టిడిపి అధ్యక్షులు కడగల ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నియోజక వర్గం ఇంఛార్జి కర్రోతు బంగార్రాజు పాల్గొన్నాఉ. చంద్రబాబు అక్రమ అరెస్టు పై కర పత్రాలు పంపిణీ చేసి రచ్చ బండ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం బంగార్రాజు మాట్లాడుతూ చంద్ర బాబు పై వైసిపి ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి వేధిస్తుందని, ప్రజలంతా గమనించి వచ్చే ఎన్నికల్లో వైసిపికి తగిన బుద్ధి చెప్పాలని అన్నారు. చంద్రబాబు విడుదల అయ్యేవరకు పోరాటం చేస్తామని తెలిపారు. కార్యక్రమంలోజిల్లా అధికార ప్రతినిధి గేదెల రాజారావు టిడిపి ఎస్‌సి సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి పోతల రాజప్పన్న, నాయకులు ఆల్తి నల్లి బాబు, దన్నాన రామ్మూర్తి, రెడ్డి నారాయణ రావు తదితరులు పాల్గోన్నారు.