జాశక్తి-కడప అర్బన్ రెండు దారుణ హత్యలతో కడప నగర ప్రజలకు ఉలిక్కిపడ్డారు. ఒకే రోజు ఇరువువు వ్యక్తులు దారుణ హత్యలకు గురయ్యారు. దీపావళి పండుగ పూట హత్యలు చోటు చేసుకోవడంతో బాధిత కుటుంబాల్లో విషాదం నెలకొన్నాయి. కడప నగరం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ న్యూ కలెక్టరేట్ సమీపంలోని ఎల్‌ఐసి క్వార్టర్స్ సముదాయంలో ఆదివారం భవాని.శంకర్ (37) అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మరో ఘటనలో చిన్న చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గురుకుల్ విద్యాపీఠ్ సమీపంలో ఆదివారం సాయికిరణ్ (28) అనే వ్యక్తి హత్యకు గుయ్యాడు. ఈరెండు హత్యలకు సంబంధించిన వివరాలు..
కడప నగరం న్యూ కలెక్టరేట్ సమీపంలోని ఎల్‌ఐసి క్వార్టర్స్ వద్ద వాలీంటర్ భవానీ శంకర్‌ను తోటి స్నేహితుడే మచ్చు కత్తితో దారుణంగా పొడిచి చంపాడు. మృతుడు వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని నిరంజన్ నగర్ 14వ డివిజన్ వాలంటీర్‌గా పనిచేసేవాడు. దీంతోపాటు ఎల్‌ఐసి కార్యాలయంలో డిజిటలైజేషన్ విభాగంలో కాంట్రాక్ట్ పద్ధతిలో విధులు నిర్వహించేవాడు. భవానీ శంకర్‌కు అక్కడే పనిచేస్తున్న టీమ్ లీడర్ మల్లికార్జున మంచి స్నేహితుడు. ఇటీవల వివాహేతర సంబంధం విషయంలో వారికి మనస్పర్థలు వచ్చాయి. తారాస్థాయికి చేరడంతో పథకం ప్రకారం మల్లికార్జున, భవానీ శంకర్‌కు ఆదివారం ఉదయం 8 గంటల ప్రాంతంలో ఫోన్ చేసి ఎల్‌ఐసి కార్యాలయం వద్దకు రావాలని పిలిచాడు. భవానీ శంకర్ రాగానే అప్పటికే అక్కడికి చేసుకున్న మల్లికార్జున ఆటో డ్రైవర్, ఎల్‌ఐసిలోనే స్కానింగ్ సెంటర్‌లో పనిచేస్తున్న రంజిత్‌లో కలిసి మచ్చుకత్తితో మెడపై దాడి చేశారు. తీవ్ర రక్తస్రావం కావడంతో శంకర్ అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న డిఎస్‌పి ఎం.డి. షరీఫ్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పరారీలో ఉన్న మల్లికార్జున కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ హత్యకు వివాహేతర సంబంధమే కారణమని భావిస్తున్నారు. వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరో ఘటనలో అప్పు తీసుకుని తిరిగి ఇవ్వమని అడిగినందుకు ఒక యువకుడిని దారుణంగా హతమార్చారు. చిన్నచౌక్ పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. కడప నగరంలోని చిన్నచౌక్ ప్రాంతానికి చెందిన సాయి కిరణ్ (28) ఓ ప్రయివేట్ షో రూంలో పనిచేస్తున్నాడు. అతను మహేష్ అనే వ్యక్తికి మూడు నెలల కిందట రూ.50వేలు అప్పుగా ఇచ్చాడు. ఈ విషయమై ఆదివారం రాత్రి చిన్నచౌక్ పాత బైపాస్ వద్ద వాగ్వివాదానికి దిగారు. పండగ పూట తనను అప్పు అడిగినందుకు ఆగ్రహించిన మహేష్ తన వద్ద ఉన్న కత్తి తీసుకుని సాయికిరణ్ కడుపులో బలంగా పొడిచాడు. తరువాత అతడే సాయి కిరణ్‌ను ను తన వాహనంలోనే ప్రయివేట్ ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో భయాందోళనకు గురైన మహేష్ పోలీసులకు లొంగి పోయాడు. కిరణ్ మతదేహాన్ని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. మతుడి తండ్రి రమణయ్య ఫిర్యాదు మరేకు చిన్నచౌక్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.