కిమ్స్ ఐకాన్‌లో విజయవంతంగా ఆపరేషన్
ప్రజాశక్తి- గాజువాక : షీలానగర్‌లోని కిమ్స్ ఐకాన్ ఆసుపత్రిలో అరుదైన ఆపరేషన్‌ను విజయవంతంగా చేశారు. ఒకేరోజు, ఒకే వ్యక్తికి కిడ్నీ, లివర్ మార్పిడి ఆపరేషన్‌ను నిర్వహించి ఔరా అనిపించారు. అరుదైన ఈ ఆపరేషన్‌కు సంబంధించి వివరాలనుఆసుపత్రి మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ చలపతిరావు ఆచంట నెెఫ్రాలజిస్ట్ డాక్టర్ ఆర్‌కె. మహేష్ తెలిపారు.
విశాఖనగరానికి చెందిన 50ఏళ్ల కనక అప్పారావు, వత్తి రీత్యా ఫోటోగ్రాఫర్. హెపటైటిస్-సి వైరస్ సమస్యతో కాలేయం, మధుమేహ సమస్యతో మూత్రపిండాలు దెబ్బతిని, ప్రాణాపాయ స్థితికి చేరుకున్నాడు. అవయవమార్పిడి చేయాల్సిన పరిస్థితుల్లో ఈనెల 2న 70 ఏళ్ల మహిళా దాత నుంచి సేకరించిన కిడ్నీ, లివర్‌ను ఒకే రోజు కిమ్స్ ఐకాన్‌లో ఆపరేషన్ చేసి అమర్చారు. సకాలంలో అవయవదాత దొరకడం, శస్త్రచికిత్స చేయడంతో రోగి ప్రాణాలతో బయటపడి, పదిరోజుల్లోనే కోలుకుని డిశ్చార్జి అయ్యాడు.
ఈ శస్త్రచికిత్సలో లివర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్ డాక్టర్ రవిచంద్ సిద్దాచారి, డాక్టర్ సచిన్ డాగా, కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జన్ డాక్టర్ ఉమామహేశ్వరరావు, డాక్టర్. మురళీ కష్ణ, గాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ ఎ. చలపతిరావు, నెఫ్రాలజిస్ట్ డాక్టర్ ఆర్‌కె మహేష్ పాల్గొన్నారు.ఈసందర్భంగా కిమ్స్ ఐకాన్ ఎండీ డాక్టర్ సతీష్‌కుమార్ మాట్లాడుతూ, ఇప్పటివరకు పదిమందికి కాలేయ మార్పిడి, వందమందికి పైగా మూత్రపిండాల మార్పిడి ఆపరేషన్ విజయవంతంగా చేశామన్నారు.ఎపి జీవన్‌దాన్ కోఆర్డినేటర్ డాక్టర్ రాంబాబు పాల్గొని, కిమ్స్ ఐకాన్ వైద్యబృందాన్ని అభినందించారు.










