Nov 10,2023 23:55

దుగ్గిరాల: మండల కేంద్రం దుగ్గిరాల పిహెచ్‌సి సెంటర్‌ పరిధిలోని రెండు సబ్‌ సెంటర్లు రాష్ట్ర స్థాయిలో ఉత్తమ సబ్‌ సెంటర్లుగా గుర్తింపు పొందాయి. దుగ్గిరాలలోని తూర్పు సబ్‌ సెంటర్‌ 93 శాత, మోరంపూడి సబ్‌ సెంటర్‌ 91 శాతం ప్రమాణాలు పాటి స్తున్నట్లు కేంద్ర కమిటీలు నిర్ణయించాయి. నేషనల్‌ క్వాలిటీ అస్స్యూరెన్స్‌ స్టాండర్డ్స్‌ (జాతీయ నాణ్యత హామీ ప్రమాణాలు) పాటించి ఈ ఘనతను సాధించినట్లు పిహెచ్‌సి డాక్టర్‌ అబ్దుల్‌ రహమాన్‌ తెలిపారు. ఒక పిహెచ్సి పరిధిలో రెండు సబ్‌ సెంట ర్లు ఈ ఘనత సాధించలేదని చెప్పారు. సెప్టెంబర్‌ 27వ తేదీన కేంద్ర బృందం ఈ సెంటర్లను పరిశీలించి ప్రమాణాలు పరి శీలించిందని, శుక్రవారం ఈ మేరకు కేంద్ర బృందం పంపించిన సమాచారాన్ని జిల్లా కేంద్రం పిహెచ్‌సికు తెలియజేసింది. మొత్తం ఏడు ప్రమాణాలు పాటించినందుకు ఆయా సబ్‌ సెంటర్లకు ఈ ఘనత లభించింది. గర్భిణులకు, చిన్నపిల్లల పట్ల తీసుకుంటున్న జాగ్రత్తలు, పురిటిబిడ్డలు, పసిపిల్లల పోషణ, పిల్లలు,యువకుల ఆరోగ్య సేవలు, ఫ్యామిలీ ప్లానింగ్‌, సంక్ర మించే వ్యాధులు, సంక్రమించని వ్యాధులు, సాధారణ అనా రోగ్యం తదితర అంశాలను పరిశీలించి ప్రమాణాలు నిర్ణ యిస్తారు. ఉత్తమ సేవలు అందించిన వారిలో డాక్టర్‌ రెహమాన్‌ తో పాటు డాక్టర్‌ సి.ఇందిర, సిబ్బంది బుజ్జి,లీల,ఆశ వర్కర్లు ఉన్నారు .