Nov 24,2022 22:39

ప్రజాశక్తి-నందిగామ
ఒకే కాన్పులో ముగ్గురు కవల పిల్లలు జన్మించిన అరుదైన సంఘటన నందిగామ పట్టణంలో గురువారం పద్మశ్రీ హాస్పటల్లో జరిగింది. నందిగామకు చెందిన షేక్‌ అమీనా భర్త సర్ధార్‌లు భార్యభర్తలు. అమీనా పురిటి నొప్పులతో బాధపడుతూ ఆస్పత్రికి వెళ్లగా ఆమెకు బ్లడ్‌ శాతం తక్కువగా ఉన్నప్పటికీ వైద్యులు సకాలంలో స్పందించి మానవతాదృక్పధంతో డబ్బులు తీసుకోకుండా సర్జరీ చేశారు. నిమిషాల వ్యవధిలోనే తొలుత ఇద్దరు మగ శిశువులు. ఒక ఆడ శిశువు జన్మించారు. ఒకే కాన్పులో ముగ్గురు కవల పిల్లలు జన్మించటంతో ఆకుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.