మొదలుపెట్టింది
నువ్వు కాకపోవచ్చు
మనసూ బుద్ధీ
అడుగూ నడకా
నీదే
ఒళ్ళు తెలియని
అలసట ఎరగని
పాకులాట...
అగమ్యగోచరమైన
గమ్యానికి
దేవులాట...
ఎగిరిపోవటం
ఒక్కసారిగా
మీద పడిపోతుంది
ఎక్కడిదక్కడ అంతే
సర్దుకోవటం
అప్పగించటం లేదు
నీవి అయినవీ కానివీ
చూస్తూ ఉండిపోతాయి
దొరికావు
నేనే గెలిచానంటూ
చావు
ఇంతకాలం
నీకు అందకుండా
తిరగటంలో కష్టం
నీకు అర్థం కాదు
గెలిచింది నేనేనంటూ
బతుకు
ఒకదానిలో మరొకటి
కలిసిపోతాయి
- కళ్ళేపల్లి తిరుమలరావు, 91770 74280