సకుడా సమ్మోహనుడా
రా ఈ రేయి
నీ దేహదాహపు కాంక్షలు తీర నన్ను కలుసుకో
కాకుంటే
నీ పాలరాతి భవనం
అత్తరు పరిమళాలు
విద్యుల్లతల వెండి వెలుగులు
నీ పట్టు పరుపుల
ఏకాంతశయన మందిరాన కాదు
నల్లగా అదే పనిగా కురుస్తున్న
కష్టపు చీకటి లోపట
ఇరుకు సందుల, బరువు బతుకుల్లో
రోగం ముసుగు తన్నిన మురికి పాకల్లో,
ఆకాశం కింద
చిరుగుబట్టల చెమట వాసనల్లో
ఆత్మాభిమానమే ఆభరణం అయినచోట
నువ్వు ఉండిననాడు
పూర్ణ పరివర్తనుడై ఇక
అప్పుడొక ఆయుధం లాంటి
కల కందాం
అంతరాలను ధ్వంసం చేస్తూ...
లోసారి సుధాకర్
99499 46991