Sep 17,2023 00:58

ప్రజాశక్తి - ఇంకొల్లు రూరల్‌
మండలంలోని ఇడుపులపాడు విద్యా పరిషత్ ఉన్నత పాఠశాలలో అంతర్జాతీయ ఓజోన్ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. సభకు పాఠశాల హెచ్‌ఎం పిడపర్తి పేరిరెడ్డి అధ్యక్షత వహించారు. అంతర్జాతీయ ఓజోన్ దినోత్సవ ఆవశ్యకత, ఓజోన్ పొరకు ఏ విధంగా నష్టం జరుగుతుందనే విషయాలు పేరిరెడ్డి విద్యార్థులకు  చక్కగా వివరించారు. ఏటా సెప్టెంబర్ 16న అంతర్జాతీయ ఓజోన్ పరిరక్షణ దినం జరుపుతున్నారన్నారు. కార్యక్రమంలో  పాఠశాల సిబ్బంది పర్వతనేని పావని, బండార్ అనిల్ కుమార్, అంబటి సురేష్, సిహెచ్ శ్రీవిద్యాలక్ష్మి, పెండ్యాల  రాధిక,  గోబిదేశీ ఆదినారాయణ, గోరంట్ల సంధ్యారాణి, కంబాలపాటి నర్సయ్య పాల్గొన్నారు.