Sep 16,2023 19:16

ప్రజాశక్తి - భీమవరం రూరల్‌
             ఓజోన్‌ పొర పరిరక్షణ ప్రపంచంలో అందరి బాధ్యత అని పర్యావరణ శాస్త్రవేత్త డాక్టర్‌ మట్లపూడి సత్యనారయణ అన్నారు. శ్రీవిజ్ఞానవేదిక ఆధ్వర్యంలో సర్‌సివి.రామన్‌ ఇంగ్లీష్‌ మీడియం స్కూలులో ప్రపంచ ఓజోన్‌ పరిరక్షణ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ సూర్యుని నుంచి వెలువడే కిరణాలు నేరుగా భూమిపై పడకుండా అందులో ఉండే అతినీలలోహిత కిరణాలును ఓజోన్‌ పొర సంగ్రహించి, ప్రాణకోటికి వాటిల్లే ముప్పు నుంచి కాపాడుతుందన్నారు. నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ మోటారు వాహనాలు పెరగడం, పరిశ్రమల కాలుష్యం, అధిక శాతం మంది ఏసీలను వినియోగించడం వల్ల ఓజోన్‌ పొర క్షీణించిపోతోందన్నారు. అడవుల నరికివేతను పూర్తిగా నిలిపివేయాలని, మొక్కలను పెంచాలని ప్రతిజ్ఞ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్కూల్‌ ప్రిన్సిపల్‌ సిహెచ్‌.పార్వతి, వైస్‌ ప్రిన్సిపల్‌ పి.సరిత, ఉపాధ్యాయులు గాయత్రి, ఎన్‌.రాధ పాల్గొన్నారు.
           వీరవాసరం :అంతర్జాతీయ ఓజోన్‌ పొర పరిరక్షణ దినోత్సవాన్ని వీరవాసరం, తోలేరు హైస్కూళ్లలో శనివారం ఘనంగా నిర్వహించారు. తోలేరులో నేషనల్‌ గ్రీన్‌కోర్‌ ఆధ్వర్యంలో, వీరవాసరంలో పాఠశాల యాజమాన్యం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా తోలేరు ప్రధానోపాధ్యాయులు విఎంజెడ్‌.శ్యాంప్రసాద్‌ మాట్లాడుతూ ఓజోన్‌ పొరను మనం రక్షించుకోకపోతే రానున్నకాలంలో జీవుల మనుడగ ప్రశ్నార్థకంగా మారుతుందన్నారు. ఓజోన్‌ భూమికి ఏ విధంగా రక్షణగా ఉంటుందో గొడుగుల ద్వారా విద్యార్థులకు వివరించారు. ఎండలో గొడుగు మనకు ఏ విధంగా రక్షణగా ఉంటుందో ఓజోన్‌ కూడా భూమికి ఆ విధంగా రక్షణగా ఉంటుందన్నారు. ఎంఆర్‌కె హైస్కూల్‌ ప్రధానోపాధ్యాయులు జె.శ్రీనివాస్‌ మాట్లాడుతూ మొక్కలను పెంచడం ద్వారా ఓజోన్‌ పొరను రక్షించుకోవచ్చన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంఇఒ శ్రీమన్నానారాయణ, ఉపాధ్యాయులు సుబ్రహ్మణ్యం, కనకలక్ష్మి, శివకుమార్‌, రవికుమార్‌, సాయిబాబు పాల్గొన్నారు.
          గణపవరం : ఓజోన్‌ పొరను రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని లయన్స్‌ క్లబ్‌ జోన్‌ పర్సన్‌ కె.సత్యనారాయణమూర్తి అన్నారు. ఓజోన్‌ డే సందర్భంగా శనివారం స్థానిక కాలేజీ విద్యార్థులకు ఓజోన్‌ పొరపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో లివో సభ్యులు రావూరి నాగరాజు, కిలారి రవిబాబు, విశారద, కాలేజీ ప్రిన్సిపల్‌ అడపాల శ్రీనివాసరావు పాల్గొన్నారు.
            పెనుగొండ : ఎస్‌వికెపి డాక్టర్‌ కెఎస్‌.రాజు ఆర్ట్స్‌, సైన్స్‌ కళాశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్‌ ప్రిన్సిపల్‌ డాక్టర్‌ వైవివి.అప్పారావు మాట్లాడారు.