ప్రజాశక్తి-విఆర్ పురం : వి.ఆర్. పురం మండలం లోని ముంపు గ్రామల గ్రామసభ ఒడ్డుగూడెం గ్రామపంచాయతీ పరిధిలో ఒడ్డుగూడెం గ్రామంలో సాయిబాబా గుడి వద్ద పోలవరం ఆర్ అండ్ ఆర్ గ్రామసభ సర్పంచ్ నరసమ్మ అధ్యక్షతన నిర్వహించారు. ఈ గ్రామ సభలో నిర్వాసిత కుటుంబాల లిస్ట్ వాలంటీర్ల కస్టర్ వైజ్ గా చదివి వినిపించారు. చదివిన నిర్వాసిత కుటుంబాల పి.డి.ఎఫ్ లో పేర్లు కానీ వారి యొక్క వివరములు తప్పు పడినచో ఒడ్డుగూడెం గ్రామ సచివాలయం పంచాయతీ సెక్రెటరీ స్వరూప రెడ్డి ఆధ్వర్యంలో మార్పులు చేర్పులు చేసుకోవాలని స్థానిక తహసిల్దార్ ఎం. శ్రీధర్ తెలియజేశారు. గ్రామసభలో ఎంపీపీ కారం లక్ష్మి జెడ్పిటిసి వల్ల రంగారెడ్డి స్థానిక తహసీల్దార్ మాట్లాడుతూ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కటాఫ్ డేట్ 18.11.2022 అని నిర్ధారణ చేయబడిందని సభ ముఖంగా తెలియజేశారు. 18 సంవత్సరాలు నిండిన యువతి యువకులు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీకి అర్హులు అని 18.11.2022 ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి కటాఫ్ ప్రకటన, ప్రభుత్వం చేసిందని 950. నిర్వాసితుల కుటుంబాలకు నష్ట పరిహారం అన్ని మౌలిక సదుపాయాలు సమకూర్చిన తర్వాతే తరలింపు అని ఆర్ అండ్ ఆర్ నిర్వాసితులకు తాడ్వాయిలో స్థలాలు ఇల్లు నిర్మించి ఇస్తారని ఎవరి కి ఏమీ కావాలో మీరే నిర్ణయం తీసుకోవాలని ఆధారములు అన్ని కచ్చితంగా ఉండి ఈ తేదీ నాటికి 18 సంవత్సరాలు నిండి ఉన్న యువతీ యువకులు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీకి అర్హులని తెలియజేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం నిర్వాసితులు ఎన్నో త్యాగాలు చేశారని, ఏ ఒక్క నిర్వాసితునికి అన్యాయం జరగకుండా చూడటమే మా బాధ్యత అన్నారు. ఆర్ ఆర్ కమిటీ మెంబర్ వి గాంధీ బాబు ఈ గ్రామ సభలో పాల్గొని ఆయన మాట్లాడుతూ నిర్వాసితులు అందరూ కలిసికట్టుగా రాజకీయ పార్టీలకు అతీతంగా. ఉండి గ్రామ సభలు సక్రమంగా జరిగే విధంగా చూసుకోవాలని వివాదాలకు పాల్పడవద్దని, ఇలా చేస్తే నష్టపోయేది నిర్వాసితులేనని, అడగవచ్చు కానీ విషయం. పక్కత్రోవ పట్టే ఆందోళన చేపట్టడం తప్పన్నారు. ఏ ఒక్క నిర్వాసితులకు కూడా అన్యాయం జరగకుండా చూడటమే మా బాధ్యత అని అన్నారు. ప్రభుత్వం కేటాయించిన పునరావాస కేంద్రంలో ఇంటి నిర్మాణ భాగంలో నిర్వాసితులే ఒక కమిటీగా ఏర్పడి అక్కడి స్థితిగతులను చూసుకోవాల్సిన బాధ్యత ఇది అని తెలియజేశారు. ఈ గ్రామ సభలో జడ్పీటీసీ వాళ్ల రంగారెడ్డి, వి. గాంధీ బాబు, రెవిన్యూ ఇన్స్పెక్టర్ రామకృష్ణ, పోలవరం చింతూరు రెవిన్యూ ఇన్స్పెక్టర్ యేసు. బాబు, ఎంపీటీసీ,ఉపసర్పంచ్, , గ్రామపంచాయతీ సెక్రటరీ, స్వరూప రెడ్డి వీఆర్వో , వాలంటీర్లు, గ్రామసచివాలయం లావణ్య సిబ్బంది, వైద్య సిబ్బంది, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు, యువతి యువకులు మరియు తదితరులు పాల్గొన్నారు,










