Jun 06,2023 23:53

కొవ్వొత్తులతో నివాళులర్పిస్తున్న టిడిపి నాయకులు

- టిడిపి ఆధ్వర్యాన కొవ్వొత్తుల ర్యాలీ
- బాధిత కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్‌
ప్రజాశక్తి-అనకాపల్లి

రైలు ప్రమాద మృతులకు శాంతి చేకూరాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక నెహ్రూ చౌక్‌ జంక్షన్‌లో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ మాట్లాడుతూ రైలు ప్రమాద బాధితులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. రైలు ప్రమాద క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. మృతుల కుటుంబాలలో ఒకరికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని కోరారు. ప్రమాదానికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు పోలారపు త్రినాథ్‌, బొద్దపు ప్రసాద్‌, సబ్బవరపు గణేష్‌, కొణతాల రత్న కుమారి, ఆళ్ళ రామచంద్రరావు, ఆకుల నానాజీ, సూరే సతీశ్‌ కుమార్‌, ధనాల విష్ణు చౌదరి తదితరులు పాల్గొన్నారు.