- ట్రాఫిక్ సమస్యలు తీర్చడానికి రాజకీయాలా... ఆవేదంన వ్యక్తం చేస్తున్న కోట ప్రజలు
- కోటలో ఉన్న ప్రభుత్వ స్థలాలు కబ్జా చేస్తున్నా పట్టించుకొనే దిక్కులేదు
ప్రజాశక్తి-కోట : కోట పట్టణంలో ఆక్రమణల తొలగింపు దశాబ్దాలుగా కోట ప్రజల చిరకాల కల ఈ కలనేరవేర్చేందుకు గూడూరు ఆర్డీవో కిరణ్ కుమార్ కు అడుగు అడుగున రాజకీయ నాయకులు అడ్డుపడుతున్నారు. కోటకు చెందిన కొంతమంది వ్యాపారస్తులు, వైసీపీ నాయకులు ఉన్నారని కోట ప్రజలు వాపోతున్నారు. గతంలో ఆర్& బి స్థలాలు ఆక్రమణలు చేసి దొంగ రిజిస్ట్రేషన్ లు చేయించుకొని బిల్డింగ్ లు కట్టారు. ఇప్పుడు కోట ఆక్రమణలపై సర్వే చేస్తే అన్నీ మోసాలు బయపడ్డాయి. ఆక్రమణ జాబితాపై అభ్యంతరాలు కార్యక్రమం ముగించి నోటీసులు జారీ చేసేందుకు అధికారులు సిద్ధం అయ్యారు. దీనితో ఆ వైసీపీ ఆక్రమణల దారుల వ్యాపారస్థుల్లో గుండెల్లోగుబులు రేగింది. నిన్న మొన్నటివరకు గూడూరు ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాద్ రావు దగ్గర అధికారులపై ఒత్తిడి చేయించారు. ఆర్డీవో మాత్రం ఆక్రమణల తొలగింపు పై వెనక అడుగు వేయలేదు. ఆర్డీవో కి మద్దుతూగా స్థానిక వైసీపీ నేతలు నిలిచారు. నిన్న మొన్నటి వరకు మంచి ఊపు మిందా ఉన్న నేతలు నిన్నటి తో బాగా చల్లపడి పోయి ఇప్పుడు అదే ఆర్డీవోపై ఒత్తిడి మొదలు పెట్టారు. ఆనాడు దివంగత మహానేత నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఆర్& బి శాఖ మంత్రి గా ఉన్నప్పుడు అభివృద్ధి పై దృష్టి పెట్టి బ్రిడ్జిలు,రోడ్డులు వేశారు.ముందు చూపుతో బ్రిటిష్ నాటి కాలం మ్యాప్ ప్రకారం రోడ్డు లు వేశారు. ఆ ముందు చూపు వల్లే నేడు కోట క్రాస్ రోడ్డు,విద్యానగర్, చిట్టెడు, కేశవరం, కడివేడు గ్రామాలు అభివృద్ధి చెందడం జరిగింది.కానీ కోటకు వచ్చే లోపు ఓటు బ్యాంక్ రాజకీయం కోసం పూటకో మాట మాట్లాడుతూ కోటను అభివృద్ధి చేయకుండా అడ్డుకుంటున్నారు. కోటలో ఆక్రమణలు అడ్డుకుంటే అభివృద్ధిని అడ్డుకోవడమే ఇలా అయితే సూళ్లూరుపేట, వెంకటగిరి, గూడూరు, బుచ్చి అభివృద్ధి జరిగి ఉండేవి కావు.కనీసం కోటలో ట్రాఫిక్ సమస్యలతో అల్లాడిపోతున్న కోట ప్రజలుకు అధికారులు, రాజకీయ నాయకులు గానీ మంచి రోడ్లు పై నడిచే భాగ్యం కల్పించలేకపోవడం దురదృష్టకరమని అనుకుంటున్నారు. కోట బజారులో ఆక్రమణల తొలిగింపు ఇప్పుడు జరగకపోతే భవిష్యత్తులో ఇక జరగదనే అపోహ కోట ప్రజల్లో వ్యక్తం అవుతుంది. నిన్న మొన్నటి వరకు అభివృద్ధి అభివృద్ధి.. అన్న నేతలు నిన్న వ్యాపారస్థులతో సమావేశం పెట్టుకొని ఇప్పుడు అభివృద్ధిని అడ్డుకోవడం వెనుక ఆంతర్యం ఏమిటి?కోట మండలంలో చేరవేగంగా కోట,విద్యానగర్ అభివృద్ధి జరిగింది.కోట లో కాలువ కట్ట పై ఉన్న గిరిజనులకు ఇంటి స్థలాలు ఇవ్వలేని దుస్థితిలో కోట నాయకులు ఉన్నారు.గూడూరు ఆర్డీవో కిరణ్ కుమార్ రాజకీయ నాయకులు మాటలు వినద్దు అని మీరు చేసే పని కరెక్ట్ ప్రజల సంక్షేమం మీకు ముఖ్యం కోట చరిత్రలో మీ సహాయం చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా కోట ప్రజలకు గుర్తు ఉంటుంది అంటున్నారు.










