Apr 20,2023 01:03
ఓఆర్‌ఎస్‌ ద్రావణం గురించి తెలియజేస్తున్న వైద్యులు జయచంద్రరావు

ప్రజాశక్తి-అద్దంకి: పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా ప్రజలు ఓఆర్‌ఎస్‌ ద్రావణాన్ని తాగితే డీహైడ్రేషన్‌ బారి నుంచి రక్షించబడతారని వైద్యులు ఎన్‌ జయచంద్రరావు అన్నారు. మండలంలోని కొత్తరెడ్డిపాలెంలో గ్రామ ప్రజలను, వృద్ధులను, మహిళలను సమావేశపరిచి ఇంటిలోనే ఓఆర్‌ఎస్‌ ద్రావణం తయారుచేసుకుని తాగే విధానంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రజలు డీహైడ్రేషన్‌తో ఉంటే షాక్‌ తగలడం, కోమాలో ఉండడం, కిడ్నీలు ఫెయిల్‌ కావడం, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉందన్నారు. ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు బయటకు వెళ్లకూడదన్నారు. ఆల్కహాల్‌ సేవించవద్దన్నారు. శరీరంలో నీటి శాతం తగినంతలేకపోతే సమస్యలు వస్తాయన్నారు. ఓఆర్‌ఎస్‌ ద్రావణం మానవునికి ఆరోగ్య సంజీవిని వంటిదన్నారు. బిపి ఎక్కువగా ఉన్నవారు, కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఈ ద్రావణాన్ని తాగకూడదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణాధికారి నీలం రామకోటేశ్వరరావు ఆరోగ్య పర్యవేక్షకురాలు డి సంపత్‌ కుమారి, డి నాగమోహన్‌రావు, ఆరోగ్య కార్యకర్త ఎన్‌ ఏసమ్మ, ఆశాలు పాల్గొన్నారు.