Feb 27,2022 11:54

విత్తు వేసెను.. మొక్క మొలుచును
కుసుమ పూసెను.. కాయ కాసెను
ఫలములగును ఫలితమొచ్చెనని
నీ..వాశించెను
కానీ ఈ ధరణి లోపల
ఆ విత్తు పడిన కష్టాలు కంటివా నీవు!!

బీటు వారిన భూమి లోపల
నెట్టు కొచ్చిన నీరు తగిలితే
బీజమొక్కటి భువిని దొల్చుతూ
నీటి చుక్కలు అందిపుచ్చితే
రాయి రప్పని తోసుకుంటూ
పురుగు పుట్టని తట్టుకుంటూ
పుడమి లోపల వేయి వేర్లుగా
పట్టు వీడని పునాదులవుతూ
ఆర్యకాంతికై అగ్నిగర్భం చీల్చుకుంటూ
మొలక మొలిచిన మొక్క అవుతూ
చిగురు పూసిన చెట్టు అవుతూ
పాడి పశువులకు గ్రాసమవుతూ
ఆశ చావని ఆశయమవుతూ
మరల మరలా చిగురింపజేస్తూ
అంచెలంచెలుగా నింగికేగుతూ
ఆరగించిన వారికి ఆశ్రయమిస్తూ
పశుపక్ష్యాదులకు ఆవాసమిస్తూ
ప్రాణికోటికి ప్రాణవాయువిస్తూ
ఎంత ఎదిగినా ఒదిగి ఉంటూ..

కవి హృదయాన కవనమై
భువి ఉపరితలాన పవనమై
మానవ మనుగడకు జీవనమై
అభివృద్ధికి ఆదర్శమై
అందరికీ మార్గదర్శకమైన
ఓ మహిజా నీకు వందనం??

- చంద్రశేఖర్‌ డోకి
90309 83871