ఓ అధికారీ.. పరిష్కారమేదీ..!
రహదారిపై మురుగునీరు
స్పందన కోసం సోషల్ మీడియాలో విమర్శలు
ప్రజాశక్తి-కుప్పం: కుప్పం పురపాలక పరిధిలో పారిశుధ్యం పడకేసింది. పలు చోట్ల డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. దలవాయి కొత్తపల్లి, అర్బన్ కాలనీలలో ఈ సమస్య అధికంగా ఉంది. పారిశుధ్యం సమస్య అనగానే సాధారణం అనిపించినా పట్టించుకోని అధికారులపై స్థానికులు మాత్రం సోషల్ మీడియాను వేదిక చేసుకొని పోటోలను పోస్ట్ చేస్తూ సమస్య మా పరిధిలో ఉందంటే.. అవును మా వీధులోనూ ఇలానే ఉందంటూ రచ్చ చేస్తున్నారు. అధికారులకు చెప్పినా పరిష్కారముండదంటూ విమర్శనాస్త్రాలను విసురుతున్నారు. అధికారుల తీరు, ప్రజాప్రతినిధుల వ్యవహారం పట్ల హాశ్యాస్పదంగా నెట్టింట చర్చించుకుంటూ కామెంట్ చేస్తున్నారు. ఏదేమైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.










