
ప్రజాశక్తి రైల్వేకోడూరు(అన్నమయ్య) : స్థానిక ఎంపీడీవో కార్యాలయం నందు ఐసిడిఎస్ సిడిపిఓ టి పి సౌభాగ్యమ్మ ఆధ్వర్యంలో సంకల్ప సప్తాహ్ కార్యక్రమంలో భాగంగా న్యూట్రిషన్ ఫుడ్స్ మేళ నిర్వహించారు. ఈ సందర్భంగా సిడిపిఓ మాట్లాడుతూ నీతి అయోగ్ వారి ద్వారా భారత ప్రధానమంత్రి ఆస్పిరేషన్స్ బ్లాక్ ప్రోగ్రాం ద్వారా 500 మండలాలను భారత దేశ పరిధిలో ఎన్నిక చేశారని అందులో భాగంగా రైల్వే కోడూరు మండలం ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రాజెక్టుగా ఎన్నిక చేయబడిందని తెలిపారు. గర్భవతులకు శ్రీమంతం అన్నప్రాసన గర్భవతుల బరువులు చూడడం ముఖ్యంగా రక్తహీనత అరికట్టడం లోప పోషణ లేకుండా చేయుటకు చిరుధాన్యాలతో తయారుచేసిన వివిధ రకాల వంటకాల ప్రదర్శనను మండలంలోని 115 అంగన్వాడీ కేంద్రంలో యందు సంకల్ప సప్తాహ్ న్యూట్రిషన్ మేళ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని అన్నారు. అంగన్వాడి కేంద్రాల ప్రాంగణంలో పెరటి తోటల పెంపకం ద్వారా ప్రతి కుటుంబాలలోను మంచి పోషకాహారం తీసుకునే విధంగా అంగన్వాడీ కేంద్రాల యందు న్యూట్రీషియన్ మేళా కార్యక్రమం నిర్వహించి గ్రామ ప్రజలకు అవగాహన కల్పించి ప్రతిజ్ఞ చేయించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో ఏసీడీపీఓ సరళ దేవి, జడ్పిటిసి పి.రత్నమ్మ,వైసిపి టౌన్ కన్వీనర్ రమేష్,నాగేంద్ర సూపర్వైజర్లు అంగన్వాడీ వర్కర్లు బాలింతలు గర్భవతులు తదితరులు పాల్గొన్నారు.