Jun 19,2023 16:54
  • కలెక్టరేట్ వద్ద స్టాఫ్ నర్సుల నిరసన 
  • జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేత 

ప్రజాశక్తి-పాడేరు : కాంట్రాక్ట్ స్టాప్ నర్సులను ప్రభుత్వం రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీ స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల ఫెడరేషన్ ఆధ్వర్యంలో సోమవారం అల్లూరి సీతారామరాజు జిల్లా పరిధిలో ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ప్రాథమిక హెల్త్ సెంటర్లు, ఏరియా ఆసుపత్రి, జిల్లా ఆస్పత్రిలో గల కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు కలెక్టర్ ఆఫీస్ ముందు ఆందోళన కార్యక్రమం నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. గత కొంతకాలంగా ప్రభుత్వానికి సర్వీస్ చేస్తున్నామని అదేవిధంగా కరోనా సమయంలో ప్రాణాలు పణంగా పెట్టి పనిచేస్తున్నామని, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్టాఫ్ నర్స్ అందరిని రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఫెడరేషన్ కన్వీనర్ శెట్టి నాగరాజు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గత కొంతకాలంగా కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేస్తామని ప్రకటించడంతో స్టాఫ్ నర్సులు ఆశగా ఎదురు చూశారని కానీ రాష్ట్ర ప్రభుత్వం నిబంధన ప్రకారం కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్ లకు అన్యాయం జరుగుతుందని తెలిపారు. తక్షణం వారి సర్వీస్ ని దృష్టిలో పెట్టుకొని రెగ్యులర్ చేయాలని అందుకు జిల్లా కలెక్టర్ వారు రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని విజ్ఞప్తి చేశారు. నిరసనకు మద్దతు పలికిన సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జూన్ 2, 2014 నాటికి ఐదు సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసుకున్న 6,662 మంది  రెగ్యులర్ చేస్తామని ప్రకటన సమంజసం కాదని  తెలిపారు. నిబంధనలను మార్పు చేసి ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులను తక్షణమే రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. ఐటిడిఏ పరిధిలో ఉన్న బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీ చేయాలని తెలిపారు. కాంట్రాక్ట్ స్టాప్ నర్సులు సమస్యలు జిల్లా కలెక్టర్ వారు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం, జిల్లా కలెక్టర్. మరియు జాయింట్ కలెక్టర్ వారికి వేర్వేరుగా వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో స్టాఫ్ నర్సుల కమిటీ ప్రతినిధులు డి.ధనలక్ష్మి, జి పద్మలత, టీ చిలకమ్మ సిహెచ్ స్వాతి, బి భారతి, వి.రమాదేవి, ఎం వసంత కుమారి తదితరులు పాల్గొన్నారు.