Jan 15,2023 18:57

ఊరు లేని సంక్రాంతి వీరిది సంక్రాంతి పండగ కన్నా బతుకు మిన్న

ప్రజాశక్తి-పిచ్చాటూరు: పిచ్చాటూరు మండలంలోని టీచర్స్ కాలనీ గ్రామమునందు చింత చెట్టు క్రింద ప్రాంతంలో పిచ్చాటూరు అరణ్ యార్ ప్రాజెక్ట్ఒడ్డున చల్లని వాతావరణంలో చిన్న గుడిసెలు ఏర్పాటు చేసుకుని బతుకుతున్నా కష్టజీవి కుటుంబాలు సంక్రాంతి పండుగ కన్నా బతుకులే మిన్న అంటున్న వారి బతుకు జీవన విధానం. స్వతంత్ర భారతదేశంలో అనేక రాజకీయ పార్టీలు, నాయకులు ప్రజలను పరిపాలన చేస్తున్నారు, కానీ ప్రజలకి కావలసిన పని దినములు లేనప్పుడు ఇలా సొంత ఊరు ను గ్రామాన్ని వదిలి బతుకు కోసమే జీవన పోరాటం సాగిస్తూ ఉంటారు కష్ట కార్మికులు.అవును కదా సంక్రాంతి అంటే ఇలా ఉండాలి,తెలతెలవారుజామునే చలిమంట వెలుగులో, తలుపు తలుపూ తట్టి, పల్లెనంతా నిద్ర లేపింది, సంక్రాంతి,పనికిరాని వన్నీ పద్ధతిగా వొదిలించుకొమ్మని, భోగిమంటై ఇంటింటా,జ్వాలా తోరణమైంది, సంక్రాంతి పండుగ చేసుకుంటారు, కానీ ఇలాంటి  రోజు పనుల కోసం ఎదురుచూసే కూలి కి మాత్రం శూన్యం. వీరు నివాసము ఉన్న ప్రాంతంలో చిన్న పిల్లలు కూడా ఉన్నారు మరి వారు చదువు సంగతి దేవుడే దిక్కు తల్లిదండ్రులు చిన్న చిన్న వస్తువులు, అమ్ముకుంటూ పొట్టకూటి కోసమే పోటి ప్రపంచములో బతుకుతున్న వారు సంఖ్య ఒక్క పిచ్చాటూరు మండలం లోని 50 మంది దాక ఉన్నారంటే అలాంటి దాగి ఉన్న బతుకుతున్న వారు ఎందరో. ఒక మంచి ప్రభుత్వం మారుమూల గ్రామాల్లో అధికారులకు ఎరగని ప్రాంతము ప్రజలకి ప్రభుత్వ ఫలాలు అందినప్పుడే ఆ ప్రభుత్వము సంపూర్ణం ప్రజాసేవకు అంకితం అయినట్లు ఉంటుంది, కానీ కొంతమంది ఊరు గాని ఊరు ప్రాంతం కాని ప్రాంతం ప్రజలు బతుకు తెరువు కోసమే ఇలా బతకడం మానవ జాతికే ఒక సవాలుగా మారడం చెప్పుకో వచ్చును.