- సీజన్లో విత్తనాలు వేయకపోతే పంటలు ఎలా పండించాలని రైతులు డిమాండ్...
ప్రజాశక్తి-విఆర్ పురం : సీజన్ వచ్చిన అందుబాటులో లేని అగ్రికల్చర్ ఆఫీసర్ సీజన్లో విత్తనాలు వేయకపోతే పంటలు ఎలా పండించాలని రైతులు ఆందోళన చెందుతున్న పరిస్తితి. మండలంలోని రేకపల్లి వ్యవసాయ అధికారి అందుబాటులో ఉండట్లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీజన్లో సబ్సిడీపై ఇవ్వాల్సిన విత్తనాలు కోసం రోజులు తడబడి తిరుగితున్నమని అధికారి నాలుగైదు రోజులు నుండి అందుబాటులొ ఉండటంలేదని రైతులు ఆరోపిస్తున్నారు. నెలలో రెండుసార్లే మాత్రమే కార్యాలయానికి వస్తున్నారని రైతులకు అందుబాటులో లేరని ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్తితి.రోజు ఆఫీసు చుట్టూ తిరగాలంటే మితిమీరిన ఖర్చు అవుతుందని, అయిన రోజుల తరబడి తిరుగుతున్నామని విత్తనాలు వేయకపోతే మేం పంటలు ఎలా పండించుకోవాలని రైతులు అంటున్నారు. అగ్రికల్చర్ సిబ్బంది అడగగా వారు అధికారి లేరని చెప్తున్నారని అన్నారు. అధికారి అంటే ఇక్కడే ఉండాలని లేకపోతే మా వ్యవసాయదారుల పరిస్థితి ఏంటని తక్షణమే ఉన్నత అధికారులు అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తాము ఈ సీజన్లో విత్తనాలు వేయకపోతే మేం పంటలు ఎలా పండించుకోవాలని తక్షణమే మాకు విత్తనాలు ఇప్పించాలని అధికారిని డిమాండ్ చేశారు.










