- ఏడాది కావస్తున్నా అందని వైనం
ప్రజాశక్తి-వి ఆర్ పురం : గత గోదావరి వరదలు వలన తీవ్ర ఇబ్బందీ పడి ఇల్లు కోల్పోయిన మాకు ఇప్పటికీ ప్రభుత్వము నష్టపరిహారం ఇవ్వలేదని మండలంలోని రాజపేట పంచాయితీలోని మొద్దులగూడెం గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరదల నివారణ చర్యల్లో భాగంగా ముఖ్యమంత్రీ నష్టపోయిన ప్రతి కుటుంబానికి 10 వేలు ఆర్థిక సహాయం ప్రకటించారు. అయినా ఇప్పటికీ మాకు ఇళ్ళ నస్టపరిహారం ఇవ్వలేదు.
- గూటాల వెంకన్న సీతంపేట గ్రామం
వరదలతో ఇల్లు మునిగి ఇబ్భందులు పడ్డాం కొంత మందికే ప్రభుత్వము గత సంవత్సరం నష్ట పరిహారం 2000 వేశారు ఇంకా మాకు మాగ్రామంలో ప్రభుత్వము ప్రకటించిన 2000 జమ కాలేదు పేరుకే హామీ వేసింది కొందరికే మిగిలి పోయిన ఇళ్లకు కూడా ప్రభుత్వం నష్ట పరిహారం ఇవ్వాలి.










