ప్రజాశక్తి-తిరుపతి : తిరుపతి రుయా ఆసుపత్రిలో శిశువు మృతదేహం లభ్యమైంది. రెండు రోజుల పురిటి బిడ్డను చంపి పడవేశారా... లేదా మృతి చెందాక ఆసుపత్రి ప్రాంతంలో వదిలి వెళ్ళారా...? అనేది విచారణ చేస్తున్నారు. పురిటి బిడ్డ మృతదేహం వద్ద లభించిన చీటీ ఆధారంగా ఫోన్లో సంప్రదిస్తే అవుట్ ఆఫ్ ఆర్డర్ వస్తుంది. శిశువు కళేబరాన్ని రుయా మార్చురీకి తరలించారు. శిశువు మృతదేహాన్ని మునిసిపాలిటీకి అప్పగించే ఆలోచనలో మార్చరీ సిబ్బంది ఉన్నారు.










