- సిఐటియు జిల్లా నాయకులు రామరాజు.
ప్రజాశక్తి-రాజవొమ్మంగి : కార్మికుల సమస్యల పరిష్కారానికై కార్మికులు నూతన ఉత్తేజముతో పోరాటాలకు సిద్ధం కావాలని సిఐటియు భవన నిర్మాణరంగం రాష్ట్ర నాయకులు రామరాజు అన్నారు, స్థానిక తాపీ మేస్త్రీ సంఘం సమావేశ భవనంలో జరిగిన సమావేశానికి రామరాజు హాజరై మాట్లాడారు. తొలిత భవన నిర్మాణ కార్మికులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. గత ఏడాది చేదు అనుభవాలను విడిచి కార్మికులు ఈ ఏడాది నూతన ఉత్తేజంతో పనిచేయాలన్నారు, కార్మికుల హక్కులను, చట్టాలను కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వీర్యం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా నాలుగు లేబర్ కోడ్ లను తీసుకొచ్చిందని తెలిపారు. వీటి వలన ఉన్న కొద్దిపాటి హక్కులు కూడా కనుమరుగవుతాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ కార్మికుల వ్యతిరేక చర్యలను ఖండించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి వత్తాసు పలకడం సరికాదన్నారు. భవన నిర్మాణ కార్మికులకు సంబంధించిన సంక్షేమ బోర్డు నిధిని భవన నిర్మాణ కార్మికులకే కేటాయించి వారి పెండింగ్ క్లైములుకు సంబంధించిన డబ్బులు తక్షణం చెల్లించాలని, గుర్తింపు కార్డులు రెన్యువల్ చేయాలని, సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. కార్మిక మార్గం ఐక్యమైతే ప్రభుత్వాలు స్తంభించిపోతాయని విషయాన్ని గుర్తించేలా ఐక్య పోరాటాల ద్వారా తెలియజేయాలని పిలుపునిచ్చారు, కార్మికులకు కనీస వేతనం 26,వేలు అమలు చేయాలని, కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు, ఈ కార్యక్రమంలో తాపీ మేస్త్రిల సంఘం నాయకులు పి శ్రీను,ఎన్ రామకృష్ణ,ఎన్ అచ్చారావ్,ఎస్ నాగు,ఎస్ వీరబాబు, అప్పన్నబాబు,సత్తిబాబు,శ్రీను,వర్మ తదితరులు పాల్గొన్నారు.










