
న్యూఢిల్లీ : క్రీడల్లో అత్యున్నత పురస్కారం అయిన 'రాజీవ్ ఖేల్‌రత్న' పేరును 'మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న'గా మార్పుచేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ అవార్డు పేరును మార్చాలని దేశవ్యాప్తంగా పౌరుల నుంచి అనేక వినతులు వచ్చాయని, వాటిని దృష్టిలో ఉంచుకొని ఖేల్‌రత్న అవార్డు పేరును మారుస్తున్నట్లు మోడి ట్విటర్‌లో వెల్లడించారు. హాకీ లెజెండ్ ధ్యాన్‌చంద్ జయంతి అయిన ఆగస్టు 29న ప్రతియేటా జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ధ్యాన్‌చంద్‌కు భారతరత్న ఇవ్వాలని చాలా రోజులుగా డిమాండ్ చేస్తున్న అతని కుమారుడు అశోక్ కుమార్.. ఖేల్‌రత్న అవార్డు పేరు మార్పును స్వాగతించారు.