Mar 25,2023 15:44
  • వి.ఆర్ పురం మండలంలో  మన్యంలో పాఠశాలలను సందర్శించిన ఎం.పి.పి కారం.లక్ష్మి

ప్రజాశక్తి-వి.ఆర్.పురం : 25న మండలంలోని మన్యంలో శనివారం రోజు కుoజ వారి గూడెం జల్లి వారి గూడెం టేకులూరు కన్న పేట సిరి గుంపు  పాఠశాలలను సందర్శించి ఎంపీపీ కారం లక్ష్మి కలిసి సిపిఎం బృందం విద్యార్థుల సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ పాత బిల్డింగు పెచ్చులూడిపోయి అస్తవ్యస్తంగా ఉందని కొత్త బిల్డింగు కట్టారు కానీ కిటికీలు లేవు ఫ్లోరింగ్ లేదు తలుపులు లేవు పిల్లల చదువులు ఎలా సాగుతాయి. స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు అయినప్పటికీ నేటికి విద్యార్థులు నేలపై కూర్చుని చదువుకొనే పరిస్థితిని ఈ పాలకులు వచ్చినందుకు బాధాకరం అని అన్నారు. సిరి గుంపు పాఠశాలలో కొత్త బిల్డింగ్ కి సున్నం కూడా చేయలేదని ఇసుకలో కూర్చోబెట్టి చదువులు చెప్పాల్సి వస్తుందని నేటికి పాఠశాలలోనే కింద కూర్చోపెట్టి పాఠాలు చెప్పించటం ఎంత దారుణమని,ప్రభుత్వం పెట్టిన కానుక పథకాలు దేనికి ఉపయోగపడుతున్నాయని అన్నారు.పాఠశాలలో ఒకే ఒక టీచర్ ను ఉంచడం వలన వారు సెలవు పెడితే సి.ఆర్.పి లు వెళ్లి 2 పాఠశాలల్లో విధులు నిర్వహించాల్సిన పరిస్థితి దాపురించిందని విద్యారంగంపై ఇంత చిన్నచూపు దేనికని విమర్శించారు. తక్షణమే టీచర్స్ ని నియమించాలని, సిరి గుంపు పాఠశాలకు ప్రహరీ నిర్మించాలని, కిటికీలు తలుపులు ఫ్లోరింగ్ చేయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ములకనపల్లి సర్పంచ్ సవలం మారయ్య సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు సత్యనారాయణ, మండల కార్యదర్శి సోయం చిన్నబాబు, రైతుసంఘం నాయకులు సోయం చిన్నబాబు,  ఉపాధ్యాయురాలు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.