Oct 11,2023 11:51
  • రైతులకు అందని ద్రాక్ష పండుల్లా... ప్రభుత్వ  ఆర్థిక సహాయం
  • పంటకోతలు అనంతరం ఈ -క్రాప్ బుకింగ్ తగునా...?

ప్రజాశక్తి-ఆత్మకూరు : రైతే దేశానికి వెన్నెముక ఆనాటి మాటమరిచి,నేడు అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణం గా,రైతుల నడ్డి విరుస్తున్నారడంలో అతిశయోక్తి లేదు. రైతులు కోసం ప్రభుత్వం పలు ప్రభుత్వ పలు పథకాలు ప్రవేశపెడుతుంటే, అధికారులు, వ్యవసాయశాఖ సిబ్బంది, మాత్రం నిర్లక్ష్యం కారణంగా అవి రైతులకు అందని ద్రాక్ష పండుల్లా తయారవుతున్నాయనీ, మండల రైతులు వాపోతున్నారు. ఇటీవల ప్రభుత్వం రైతు భరోసాను అందించేందుకు, యుద్ధ ప్రాతిపదిక పైన, ఈ బుక్ క్రాపింగ్ చేపట్టారు. అయితే ఎక్కడ కూడా, ప్రభుత్వ అధికారులు నియమ, నిబంధన లప్రకారం నిర్వహించకపోవడం వల్ల రైతులు, రైతు భరోసా కేంద్రాలు చుట్టూ, ప్రదక్షణాలు చేస్తూ, విసిగి, వేసారి, అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు మండల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదీ, ఏమైనా, మండలంలోని పలు రైతు భరోసా కేంద్రాల్లో  సిబ్బంది, అధికారులు, పంట కోత ప్రయోగాలు కానీ, ఈ క్రాప్ బుకింగ్ కానీ, నియమ, నిబంధనాల ప్రకారం చేయకపోవడంతో, పంట నష్టం వాటిళ్లిన రైతు సోదరులు పూర్తి స్థాయిలో నష్టపోతున్నారని నిస్సందేశంగా చెప్పవచ్చును. అంతేకాకుండా, పలు రైతు భరోసా కేంద్రాల్లో  ఆర్.బి.సి. సిబ్బంది విధులకు పూర్తి స్థాయిలో, న్యాయం చేయకుండా, కాలయాపన కోసం విధులు నిర్వర్తిస్తున్నారని, మరీ కొన్ని గ్రామసచివాలయాల్లోని రైతు భరోసా కేంద్రాల్లో రైతులు చేయి, తడపితే నే తప్ప, ప్రభుత్వం అందించే పంటబీమా, రైతు భరోసా లాంటి పథకాలు అందవనే విమర్శలు వినిపిస్తున్నాయి.