Nov 07,2023 01:28

గుంటూరులో ఎఫ్‌ఐఆర్‌ ప్రతులను దహనం చేస్తున్న రైతు, ప్రజా సంఘాల నాయకులు

ప్రజాశక్తి - గుంటూరు, పల్నాడు జిల్లాల విలేకర్లు : స్వతంత్ర మీడియా సంస్థ న్యూస్‌ క్లిక్‌పై కేంద్ర ప్రభుత్వ దాడిని ప్రజాస్వామ్యవాదులంతా ఖండించాలని, సంస్థ విలేకరులపై మోపిన అక్రమ కేసుల్ని ఉపసంహరించుకోవాలని రైతు, కార్మిక, ప్రజా సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. న్యూస్‌క్లిక్‌ విలేకరులపై పెట్టిన కేసులకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌ కాపీలను దేశ వ్యాప్త పిలుపులో భాగంగా గుంటూరు, పల్నాడు జిల్లాల్లోని పలుచోట్ల సోమవారం దహనం చేశారు. న్యూస్‌ క్లిక్‌ యాజమాన్యంపై పెట్టిన అక్రమ కేసులు వెంటనే ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. ఇందులో భాగంగా పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని ధర్నా చౌక్‌ వద్ద కార్యక్రమంలో కౌలురైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వై.రాధాకృష్ణ మాట్లాడారు. ఢిల్లీలో జరిగిన రైతు పోరాటానికి మద్దతుగా నిలిచిందనే అక్కసుతోనే న్యూస్‌క్లిక్‌ యాజమాన్యంపై ఈ వేధింపులని అన్నారు. ఎఐటియుసి పల్నాడు జిల్లా కార్యదర్శికాసా రాంబాబు మాట్లాడుతూ నిర్బంధాలతో ఉద్యమాలను అణిచివేయాలని చూడటం ప్రభుత్వ అవివేమన్నారు. రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఏపూరి గోపాలరావు మాట్లాడుతూ రైతులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకుండా తాత్సారం చేస్తోందని విమర్శించారు. దేశవ్యాప్తంగా రాష్ట్ర రాజధానుల్లో జరిగే ఆందోళన కార్యక్రమంలో భాగంగా ఈ నెల 27, 28 తేదీల్లో విజయవాడలో జరిగే మహాధర్నాలో రైతాంగం కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు గుంటూరు విజయకుమార్‌, డి.శివకుమారి, షేక్‌ సిలార్‌, వి.వెంకట్‌, రంగయ్య పాల్గొన్నారు. గుంటూరులోని శంకర్‌విలాస్‌ సెంటర్‌లో కార్యక్రమానికి రైతు సంఘం జిల్లా కార్యదర్శి కంచుమాటి అజరు కుమార్‌ అధ్యక్షత వహించారు. ఎఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు వి.రాధాకష్ణమూర్తి, సిఐటియు జిల్లా కార్యదర్శి బి. ముత్యాలరావు, రైతు కూలీ సంఘం నాయకులు గనిరాజు, రైతు, కార్మిక సంఘాల నాయకులు పచ్చల శివాజీ, ఎం.హనుమంతరావు, కొల్లి రంగారెడ్డి, కె.శ్రీనివాసరావు, ఈమని అప్పారావు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే మీడియా సంస్థల గొంతు నొక్కటానికి, కక్షసాధింపు చర్యలకు బిజెపి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలని చేస్తున్న ఉద్యమం వెయ్యిరోజులైన సందర్భంగా తెలుగు ప్రజలంతా స్టీల్‌ ప్లాంట్‌ కార్మికులకు సంఘీబావం తెలపాలని కోరారు. ఢిల్లీలో మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఏడాది పాటు నిర్వహించిన పోరాటాన్ని బలపరిచి, ఎప్పటికప్పుడు వార్తలు ప్రచురించిన న్యూస్‌ క్లిక్‌ యజమాన్యంపై కేంద్రం కక్షసాధింపుగానే కేసులు మోపిందని విమర్శించారు. రైతులు, కార్మికులు, ఇతర సామాన్య ప్రజలపై కేంద్రం చేస్తున్న దాడిని ప్రజలు ఐక్యంగా ఎదుర్కొనాలని పిలుపునిచ్చారు. కె.నళినీకాంత్‌, ఎఅరుణ్‌ కుమార్‌, కె.విటల్‌రెడ్డి, నాసర్‌వలి, కె.కిరణ్‌, జె.చైతన్య, నికల్సన్‌, షేక్‌ ఖాసిం పాల్గొన్నారు. మేడికొండూరు సెంటర్లో నిర్వహించిన కార్యక్రమంలో కౌలురైతు సంఘం నాయకులు బి.రామకృష్ణ, ఎం.సీతాపతి ,ఎస్‌కె.ఇమామ్‌ షరీఫ్‌, మౌలాలి, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ముప్పాళ్ల మండలం మాదలలో నిరసన తెలపగా రైతు సంఘం జిల్లా అధ్యక్షులు జి.బాలకృష్ణ మాట్లాడారు. ఎం.వెంకటరెడ్డి, జి.జాలయ్య, ఐ.వెంకటరెడ్డి, సత్యనారాయణరెడ్డి, పి.సైదాఖాన్‌, కె.సాంబశివరావు, షేక్‌ సైదా, కె.కోటి వీరయ్య పాల్గొన్నారు. పిడుగురాళ్లలోని మార్కెట్‌ యార్డు సెంటర్‌ వద్ద ప్రతులను దహనం చేశారు. నాయకులు టి.శ్రీనివాసరావు, వెంకటకృష్ణ, ఎస్‌.వెంకటేశ్వర్లు, ఎస్‌.నరసింహారావు, కె.లక్ష్మణమూర్తి, కె.డేవిడ్‌, రాజా, శేషారావు పాల్గొన్నారు. తాడేపల్లి పట్టణం ఉండవల్లి సెంటర్‌, మండలంలోని కుంచనపల్లిలో నిరసన తెలపగా రైతు సంఘం గుంటూరు జిల్లా అధ్యక్షులు జొన్నా శివశంకరరావు, సిఐటియు తాడేపల్లి పట్టణ కార్యదర్శి వి.దుర్గారావు మాట్లాడారు. ఎం.శ్రీనివాసరెడ్డి, కె.జగదీశ్వరరెడ్డి, బి.వెంకటేశ్వరరావు, బూరుగ వెంకటేశ్వర్లు, బి.బక్కిరెడ్డి, పి.కృష్ణ, కె.కరుణాకరరావు, ఎ.శౌరిబర్తులం, గోపిరెడ్డి, దశరథరామిరెడ్డి, వెంకటయ్య, డి.వెంకటరెడ్డి, కె.వెంకటేశ్వరరావు, ఎ.రంగారావు, అమ్మిశెట్టి రామారావు, బి.వెంకటేశ్వరరావు, శ్రీనివాసరావు పాల్గొన్నారు. అమరావతిలో నిరసన తెలపగా ప్రజా సంఘాల కన్వీనర్‌ సూరిబాబు మాట్లాడారు.సయ్యద్‌ మొహుద్దీన్‌ వలి, బాబు పాల్గొన్నారు.