
ప్రజాశక్తి - భీమవరం రూరల్
న్యూస్ క్లిక్ సిబ్బందిపై కేంద్ర ప్రభుత్వం అక్రమంగా పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలి సిఐటియు మండల కార్యదర్శి ఇంజేటి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మంగళవారం రైతు సంఘాల సమన్వయ కమిటీ, కార్మిక సంఘాల పిలుపుమేరకు వెంప గ్రామంలో సిఐటియు, వ్యకాస ఆధ్వర్యంలో న్యూస్ క్లిక్ సిబ్బందిపై పెట్టిన అక్రమ కేసులు రద్దు చేయాలని వెంప బస్టాండ్ సెంటర్లో జిఒ కాపీలను దహనం చేశారు. ఈ సందర్భంగా సిఐటియు మండల కార్యదర్శి ఇంజేటి శ్రీనివాస్ మాట్లాడుతూ బావ ప్రకటనా స్వేచ్ఛను హరించే విధంగా న్యూస్ క్లిక్ పత్రిక విలేకరిపై అక్రమంగా కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండించారు. న్యూస్ క్లిక్ పత్రిక విలేకరిపై పెట్టిన అక్రమ కేసులు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.