Aug 29,2023 23:22

నిరసన తెలుపుతున్న న్యాయవాదులు

* బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు సూర్యారావు
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్‌: 
న్యాయవాదుల రక్షణ చట్టం పటిష్టం చేసి న్యాయవాదులకు రక్షణ కల్పించాలని బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు డాక్టర్‌ ఎన్ని సూర్యారావు అన్నారు. విజయవాడలో న్యాయవాది ఆవుల ప్రవీణ్‌ కుమార్‌పై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేయడాన్ని, బెజవాడ బార్‌ అసోసియేషన్‌ సభ్యుడు తగరం కిరణ్‌బాబుపై వీరవల్లి పోలీస్‌ అధికారులు పెట్టిన కేసులను నిరసిస్తూ బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యాన న్యాయవాదులు మంగళవారం విధులు బహిష్కరించారు. జిల్లా కోర్టు ఆవరణలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయవాదులపై ఇటీవల దాడులు పెరుగుతున్నాయని, ఇటువంటి ఘటనలు పునరావతం కాకుండా చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో అసోసియేషన్‌ కార్యదర్శి పొన్నాడ రాము, ఉపాధ్యక్షులు చంద్రమౌళి, అన్నెపు భువనేశ్వరరావు, బిసి అడ్వకేట్‌ సంఘం అధ్యక్షులు ఆగూరు ఉమామహేశ్వరరావు, భాస్కరరావు, హరిప్రియ, సీనియర్‌ న్యాయవాదులు కూన అన్నంనాయుడు, సనపల హరి, దుంపల రమణారావు, ఎన్ని రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.