Feb 25,2023 23:23

గెలుపు సంకేతాలు చూపుతున్న విజేతలు

అధ్యక్ష, కార్యదర్శులుగా రాంబాబు, శ్రీనివాస్‌
ప్రజాశక్తి- లీగల్‌ రిపోర్టర్‌ :
విశాఖపట్నం న్యాయవాదుల సంఘం ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. శుక్రవారం పోలింగ్‌ జరగ్గా, రాత్రి నుండి శనివారం వేకువజాము వరకు సాగిన ఓట్ల లెక్కింపులో సంఘం అధ్యక్షులుగా చింతపల్లి రాంబాబు, ప్రధాన కార్యదర్శిగా పైలా శ్రీనివాసరావు విజయం సాధించారు. అధ్యక్ష ఎన్నికల్లో రాంబాబు తన సమీప ప్రత్యర్థి తాళ్లూరి రవిపై 609 ఓట్లతో విజయం సాధించారు. ప్రధాన కార్యదర్శిగా పైలా శ్రీనివాసరావు, 1,016 ఓట్ల మెజార్టీతో సుగ్గు సుధీర్‌ రెడ్డిపై గెలుపొందారు. హోరాహోరీగా సాగిన ఉపాధ్యక్ష ఎన్నికల్లో ఎస్‌ఎస్‌.వాసుపై 66ఓట్ల తేడాతో బిఎస్‌ లత, సంయుక్త కార్యదర్శిగా అడపా సుధీర్‌రావుపై 60 ఓట్ల మెజార్టీతో దుర్గాప్రసాద్‌, గ్రంథాలయ కార్యదర్శిగా సబ్బవరపు గోపాలకృష్ణపై 552 ఓట్లు తేడాతో చింతాడ అర్చన, సాంస్కతిక కార్యదర్శిగా ఎస్‌ కే హుస్సేన్‌పై 341 మెజార్టీతో ప్రకృతి శైలజ విజయం సాధించారు. విజేతలను మాజీ అధ్యక్ష, కార్యదర్శులు వైద్యుల రవీంద్రప్రసాద్‌, వేణుగోపాల్‌, బార్‌ కౌన్సిల్‌ మెంబర్లు బైపా అరుణ్‌ కుమార్‌, ఎస్‌ కృష్ణమోహన్‌, బార్‌ కౌన్సిల్‌ ఉపాధ్యక్షులు రామజోగేశ్వరరావు, పలువురు సీనియర్‌ జూనియర్‌ న్యాయవాదులు కొత్త కమిటీకి అభినందనలు తెలిపారు.