Nov 17,2023 23:15

న్యాయస్థానానికి చంద్రబాబు తప్పుడు అఫిడవిట్లు

* పశుసంవర్థకశాఖ మంత్రి అప్పలరాజు
ప్రజాశక్తి- పలాస : 
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సిఎం చంద్రబాబునాయుడు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని, అయితే తన ఆరోగ్యం సక్రమంగా లేదని న్యాయ స్థానానికి తప్పుడు నివేదికలు అందజేయడం ప్రజలు గమనిస్తున్నారని మత్స్య, పశుసంవర్థకశాఖ మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు అన్నారు. స్థానిక ప్రగతి భవనంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు ఉద్దేశపూర్వకంగా తన న్యాయవాదుల ద్వారా ఇంటి వద్దేనే తప్పుడు పత్రాలు తయారు చేసి కోర్టుకు సమర్పించి తప్పుదోవ పట్టించి బెయిల్‌ పొందాలని చూస్తున్నారని అన్నారు. చంద్రబాబుకు గుండె సంబంధిత ఆరోగ్య సమస్యలుంటే ముందుగా ఎంజోగ్రామ్‌ చేయించాలని, అలా చేయించకుండా తన స్వార్థప్రయోజనాల కోసం ఆస్పత్రులను వినియోగిస్తున్నారని ఆరోపించారు. ఆయనకు ఉన్న అనారోగానికి జైలు నుంచి విడుదలైన తక్కువ రోజుల్లో ఆపరేషన్‌ ఎలా చేస్తారని ప్రశ్నించారు. చంద్రబాబు స్కీల్‌ డవలప్‌మెంట్‌ స్కేమ్‌లో రాజమండ్రి సెంటల్‌ జైల్లో ఉన్న సమయంలో ఆయన ముసలివాడు అయిపోయాడని, అనేక రోగాలున్నాయని చంద్రబాబు కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులు ప్రచారం చేశారని గుర్తు చేశారు. దీని వెనుక అనేక కుట్ర కోణాలున్నాయని ఆరోపించారు.