Apr 27,2023 01:50
జడ్జిలను సన్మానిస్తున్న న్యాయవాదులు

ప్రజాశక్తి-పర్చూరు: లోక్‌ అదాలత్‌లు, న్యాయ విజ్ఞాన సదస్సుల నిర్వహణలో న్యాయవాదులు ఎంతో సహకారం అందిం చారని పర్చూరు సీనియర్‌ సివిల్‌ జడ్జి ఎం కుముదిని అన్నారు. బదిలీపై వెళుతున్న న్యాయమూర్తులకు పర్చూరు కోర్టు ప్రాంగణంలో వీడ్కోలు సభ నిర్వహించా రు. సీనియర్‌ జడ్జి కుముదిని, జూనియర్‌ సివిల్‌ జడ్జి నాగేశ్వరరావు నాయక్‌లకు ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా కుముదిని మాట్లాడుతూ త్వరగా కేసులు పరిష్కారం చేయటంలో న్యాయవాదులు అందించిన సహకారం మరువలేనిదన్నారు. న్యాయవాదులను అభినందించారు. జూనియర్‌ సివిల్‌ జడ్జి నాగేశ్వరరావు నాయక్‌ మాట్లాడుతూ పర్చూరులో తనకు లభించిన ఆదరణ ఎన్నటికీ మరువలేనిదని అన్నారు. సీనియర్‌ సివిల్‌ జడ్జి ఎం కుముదిని గుంటూరుకు, నాగేశ్వరరావు నాయక్‌ తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురానికి బదిలీ అయ్యారు. న్యాయమూర్తులను, వారి కుటుంబ సభ్యులను బార్‌ అసోసియేషన్‌ సభ్యులు, కోర్టు సిబ్బంది ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో బార్‌ అసోసి యేషన్‌ అధ్యక్ష కార్యదర్శులు కొల్లా నరేంద్ర కుమార్‌, రావి శ్రీనివాసరావు, న్యాయవాదులు, సిబ్బంది పాల్గొన్నారు.