Sep 22,2023 01:05

ప్రజాశక్తి - బాపట్ల
పదోన్నతిపై అనంతపురం జిల్లా 8వ అదనపు జిల్లా జడ్జిగా వెళ్తున్న బాపట్ల ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి బి సాధుబాబును బార్ అసోసియేషన్ అధ్యక్షులు భీమా లీలా కృష్ణ ఆధ్వర్యంలో న్యాయవాదులు గురువారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా లీలా కృష్ణ మాట్లాడుతూ నిర్వహణలో జడ్జి సాదుబాబు తీసుకున్న నిర్ణయాలు ఎంతో సత్ఫలితాలు ఇచ్చాయన్నారు. జడ్జి సాదు బాబు మాట్లాడుతూ బార్ అసోసియేషన్ సభ్యులు అందించిన సహకారం, ఆదరాభిమానాలు ఎల్లప్పుడూ మరువలేనని తెలిపారు.  కార్యక్రమంలో అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జ్ జి వాణి, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ జి రుక్మిణి పాల్గొన్నారు.