May 29,2023 23:42

ప్రజాశక్తి - కాకినాడ కార్పొరేషన్‌ తనను వేధిస్తున్న పోలీసుల నుంచి రక్షణ కల్పించాలని, తనకు న్యాయం చేయాలని అమలాపురం గొల్లగూడెంకు చెందిన వాసి ఆరుద్ర తన వికలాంగురాలైన కుమార్తెతో కలిసి కాకినాడ కలెక్టరేట్‌ వద్ద సోమవారం ధర్నా చేశారు. తన కుమార్తె అనారోగ్య సమస్యలతో ఇల్లు అమ్ముకుంటే ఇద్దరు కానిస్టేబుల్స్‌ వేధిస్తున్నాడని ఆమె తెలిపారు. స్పందనలో ఫిర్యాదు చేసినా తనకు న్యాయం చెయ్యలేదని ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న కలెక్టర్‌ కృతికా శుక్లా, ఆమెను తన ఛాంబర్‌ వద్దకు తీసుకురావాలని పోలీసులను ఆదేశించారు.