
ప్రజాశక్తి -బత్తలపల్లి : టిడిపి అధినేత చంద్రబాబు కోసం తాము నిరసనలు చేస్తుంటే పోలీసులు లాఠీ ఛార్జ్ చేస్తున్నారని, బాబు కోసం అవసరమైతే నిరాహారదీక్షలే కాదు ప్రాణ త్యాగానికైనా సిద్ధమని టిడిపి ధర్మవరం నియోజకవర్గ ఇన్‌ఛార్జి పరిటాల శ్రీరామ్ అన్నారు. బాబు తోనే నేను కార్యక్రమంలో భాగంగా బత్తలపల్లిలో టిడిపి నాయకులు చేపట్టిన నిరసన కార్యక్రమంలో పరిటాల శ్రీరామ్ పాల్గొన్నారు. సిపిఐ జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్, జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జి చిలకం మధుసూదన్ రెడ్డి, స్థానిక సిపిఐ నాయకులు కాటమయ్య, వెంకటేష్ , కురుబ సంఘం, వాల్మీకి సంఘం, మహిళలు ఈ నిరసన కార్యక్రమానికి మద్దతు పలికారు. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఈ నిరసన కార్యక్రమాన్ని కొనసాగించారు. ఈ సందర్భంగా పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ స్కిల్ డెవలప్మెంట్ లో చంద్రబాబు ఎలాంటి తప్పిదం చేయలేదన్నారు. ఎంతోమంది నిరుద్యోగులకు వత్తి, విద్య శిక్షణలు ఇచ్చి ఎంతోమంది నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తే ఈ సైకో ప్రభుత్వం అక్రమంగా కేసులు పెట్టిందని విమర్శించారు.రిలే నిరాహార దీక్షలో మండల కన్వీనర్ గోనుగుంట్ల నారాయణరెడ్డి, కుమ్మర శాలి వాహన సాధికారిక కన్వీనర్ మదనపు పొతలయ్య, నియోజకవర్గ రైతు సంఘం అధ్యక్షుడు చల్ల శ్రీనివాసులు, సులేమాన్, బాసికొండ రవీంద్ర, నాగార్జున రెడ్డి, ఆంజనేయులు, నాగభూషణ, డేరంగుల ప్రతాప్, పురుషోత్తం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ధర్మవరం టౌన్ : ప్రతిపక్షాల గొంతునొక్కేందుకే వైసీపీ ప్రభుత్వం అక్రమం గా కేసులు బనాయించడం, అరెస్టులు చేయడం వంటి దుశ్చర్యలకు పాల్పడుతోందని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ముసుగుమధు పేర్కొన్నారు. చంద్రబాబునాయుడి అక్రమ అరెస్టును నిరసిస్తూ నాయకులు పట్టణంలో ర్యాలీ చేపట్టి అనంతరం కళాజ్యోతి సర్కిల్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ ప్రతిపక్షాల గొంతునొక్కేందుకే వైసీపీ ప్రభుత్వం అక్రమంగా కేసులు బనాయించడం, అరెస్టులు చేయడం వంటి దుశ్చర్యలకు పాల్పడుతోందని అన్నారు. రాజకీయ లబ్దికోసం, ఎన్నికల కోసం ఇలాంటివి చేయడం దుర్మార్గమన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ చేనేత కార్మికసంఘం తాలూకా అధ్యక్ష, కార్యదర్శులు వెంకటస్వామి, వెంకటనారాయణ, సీపీఐ పట్టణ కార్యదర్శి రవికుమార్, సహాయకార్యదర్శి వై.రమణ, ఎఐవైఎఫ్ జిల్లా అధ్యకులు సకలరాజా తదితరులు పాల్గొన్నారు.
తలుపుల : చంద్రబాబు అరెస్టు అక్రమమని టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి కందికుంట వెంకటప్రసాద్ విమర్శించారు. ఈ మేరకు టిడిపి నాయకులు స్థానిక తహశీల్దార్ కార్యాలయం ముందు గురువారం రిలే దీక్షలు చేపట్టారు, వీరికి మద్దతుగా తలుపుల మండలం సిపిఐ సిపిఎం నాయకులు రిలే దీక్షలో పాల్గొన్నారు ఈసందర్బంగా కందికుంట వెంకటప్రసాద్ మాట్లాడుతూ రాజకీయంగా ఎదుర్కోలేక ప్రతిపక్ష నాయకులపై అన్యాయంగా అక్రమ కేసులు పెట్టి వారిని ఇబ్బంది పెడుతున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అని అన్నారు. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని విమర్శించారు. రాబోవు రోజుల్లో జగన్‌కు ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు పర్వీన్ భాను, మనోహర్ నాయుడు, ఓబుల్ రెడ్డి, రాజశేఖర్, ముబారక్ తదితరులు పాల్గొన్నారు.
పెనుకొండ : జగన్ ప్రభుత్వం అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెబుతారని టిడిపి జిల్లా అధ్యక్షులు బికె పార్థసారథి తెలిపారు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు చేపట్టిన సామూహిక రిలే నిరాహార దీక్షలు గురువారం కొనసాగాయి. దీక్షకు మాజీ మంత్రి పరిటాల సునీత, నాయకులు రామకృష్టప్ప, కురుబ కృష్ణమూర్తి, రొద్దం నరసింహులు, జివిపి నాయుడు, చిన్నప్పయ్య, మాధవనాయుడు, సుబ్బరత్నమ్మ, తదితరులు సంఘీభావం తెలిపారు. పార్థసారథి మాట్లాడుతూ చంద్రబాబు అక్రమ అరెస్టును మేధావులు, రాజకీయ ప్రముఖులు, ప్రజలు, ప్రతి ఒక్కరూ ముక్తకంఠంతో ఖండిస్తున్నారన్నారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాల్లో ఐటి ఉద్యోగులు చంద్రబాబుకి సంఘీభావం తెలుపుతున్నారన్నారు. వీరి దీక్షకు జనసేన, జైభీమ్ భారత్ పార్టీలు సంఘీభావం తెలిపాయి. దీక్షలో నాయకులు రఘువీర, శ్రీనివాసులు, బోయ నాగరాజు, రామలింగ, హుజూర్, అనసూయమ్మ, లీలావతి, గాయిత్రి, హరీష్, ఆదిశేషు, వేణు, రొద్దం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కనగానపల్లి : రాష్ట్రం ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న సమయంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ టిడిపితో కలిసి వస్తానని చెప్పడం మంచి పరిణామం అని పరిటాల సునీత పేర్కొన్నారు. నియోజకవర్గంలో జనసేనతో కలిసి పని చేస్తామన్నారు. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ చేపట్టిన రిలే నిరహార దీక్షలు కొనసాగా యి. గురువారం దీక్షలో పరిటాల సునీత, ధర్మవరం నియోజకవర్గ ఇన్‌ఛార్జి పరిటాల శ్రీరామ్ పాల్గొన్నారు. పరిటాల సునీత మాట్లాడుతూ స్థానిక ఎస్‌ఐ కార్యకర్తలపై ఇష్టానుసారం అక్రమకేసులు పెట్టారని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే ప్రకాష్‌రెడ్డి ఆరోపణలపై స్పందిస్తూ తనపై సిఐడితో కాకపోతే సిబిఐతో విచారణ చేయించుకోమని సవాల్ విసిరారు. టిడిపి అధికారంలోకి రాగానే ఎమ్మెల్యే ప్రకాష్‌రెడ్డి అక్రమాలను వెలుగులోకి తెస్తామన్నారు. పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ చంద్రబాబు జైలు నుంచి విడుదల అయ్యే వరకూ పోరాటం కొనసాగుతుంద న్నారు. స్కిల్ డెవలప్‌మెంట్‌లో స్క్యాం జరగలేదని, ఇది వైసిపి సృష్టించిన కట్టు కథ అన్నారు.
గోరంట్ల : టిడిపి అధినేత చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ గురువారం మాజీ ఎంపి నిమ్మల కిష్టప్ప ఆధ్వ ర్యంలో స్థానిక చంద్రశేఖర్ థియేటర్ సమీపంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. నిమ్మల కిష్టప్ప మాట్లాడుతూ టిడిపి హయాంలో ఎన్నడూ ప్రతిపక్షాలపై అక్రమ కేసులు, దౌర్జన్యాలకు పాల్పడలేదన్నారు. వైసిపి అధికారం చేపట్టినప్పటి నుంచి ప్రతిపక్ష నేత చంద్రబాబు, టిడిపి సానుభూతిపరులపై అక్రమ కేసులు బనాయిస్తూ రాష్ట్రాభివృద్ధిని గాలికి వదిలేశారన్నారు. ఆదర్శ విద్యాసంస్థల అధినేత సుబ్రహ్మణ్యం, రాష్ట్ర కార్యనిర్వా హక కార్యదర్శి సవితమ్మ, ఒడిసి, బుక్కపట్నం మండలాల కార్యకర్తలు దీక్షలకు సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో నాయకులు సుబ్రహ్మణ్యం, ఎల్‌ఎన్ నారాయణస్వామి, బాలకృష్ణచౌదరి, శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.
మడకశిర : టిడిపి శ్రేణులపై జరిగిన దమనకాండ, సిఎం జగన్ కక్షపూరిత రాజకీయాలకు నిరసనగా మాజీ ఎమ్మెల్సీ, నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి గుండుమల తిప్పేస్వామి ఆధ్వర్యంలో పట్టణంలోని అన్న క్యాంటీన్ దగ్గర రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా గుండుమల మాట్లాడుతూ చంద్రబాబు రిమాండ్ నుంచి కడిగిన ఆణిముత్యంలా బయటకు వస్తారని, ఎవరూ అధైర్యపడొద్దని సూచించారు. టిఎన్‌ఎస్‌ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు మురళిబాబు, సిపిఎం, సిపిఐ, రైతు, జైభీమ్ సంఘాల నాయకులు సంఘీభావం తెలిపారు. దీక్షలో మండల కన్వీనర్ లక్ష్మీనారాయణ, మనోహర్, భక్తర్‌సాబ్, తిమ్మరాజు, శంకర్, కృష్ణమూర్తి, రామాంజనేయులు, కట్టా కిషోర్, రవికుమార్, కళ్లుమరి నాగరాజు, గౌడనహళ్లి నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.
అమరాపురం : చంద్రబాబు త్వరగా జైలు నుంచి విడుదల కావాలని, ఆయన సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని కాంక్షిస్తూ మండల పరిధిలోని ప్రసిద్ధ హేమావతి సిద్దేశ్వరస్వామి ఆలయంలో టిడిపి మండల కన్వీనర్ గణేష్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు జరిపించారు. స్వామి వారికి 101 టెంకాయలు సమర్పించారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
పుట్టపర్తి రూరల్ : తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడుకు ఆత్మస్థైర్యం నింపడమే మనందరి బాధ్యతని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు అరెస్టు నిరసనగా శ్రీ సత్య సాయి జిల్లా ఆర్డీవో కార్యాలయం ముందు టిడిపి ఆధ్వర్యంలో నిర్వహిస్త్ను రెండవ రోజు నిరసన దీక్షకు పుట్టపర్తి నాయకులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. గురువారం నిర్వహించిన దీక్షలకు పుట్టపర్తి మండలానికి చెందిన తెలుగుదేశం నాయకులు రామప్ప నాయుడు, పుల్లప్ప, ఎల్‌ఐసి నరసింహులు, శ్రీరామ్ రెడ్డి, జయ ప్రకాష్, మాజీ జెడ్పీటీసీ చెన్నకేశవులు, మండల కన్వీనర్లు రామాంజనేయులు, విజయకుమార్, ఆదినారాయణ రెడ్డి, శ్రీరామ్ నాయక్ తదితరులతో పాటు వందలాది మంది కార్యకర్తలు పాల్గొన్నారు. అదేవిధంగా జనసేన అబ్దుల్లా, రాము, తిరుపతేంద్ర తదితర నాయకులు దీక్షలకు మద్దతు తెలిపారు.ఈ సందర్భంగా పల్లె రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడి అరెస్టు అక్రమమని అన్నారు. చంద్రబాబు చేపట్టిన వివిధ కార్యక్రమాలకు రాష్ట్ర ప్రజలు బ్రహ్మరథం పట్టిన విషయాన్ని జీర్ణించుకోలేక వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక పద్ధతి ప్రకారం స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో ఇరికించారని విమర్శించారు. జగన్‌కు వచ్చే ఎన్నికల్లో ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. పస లేని కేసులు పెట్టి, చంద్ర బాబు ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో నాయకులు గూడూరు ఓబులేసు, సామకోటి ఆదినారాయణ, అంబులెన్స్ రమేష్ , బొమ్మయ్య, కొట్లపల్లి జగన్, నాగిరెడ్డి, రామయ్య, వెంకట గారి పల్లి, ఓబులేసు తదితరులు పాల్గొన్నారు.
హిందూపురం : చంద్రబాబు నాయుడుకు బెయిల్ వచ్చే వరకు తమ ఉద్యమాలు కొనసాగుతాయని మాజీ ఎమ్మేల్యే, సీనియర్ టిడిపి నాయకులు సిసి వెంకట్రాముడు అన్నారు. గురువారం పట్టణంలోని ఇందిరమ్మ సర్కిల్‌లో టిడిపి నాయకులు దీక్ష చేపట్టారు. ఈ సందర్బంగా సిసి వెంకట్రాముడు, అంబికా లక్ష్మినారాయణ, శ్రీనివాస రావు, అంజినప్ప మాట్లాడుతు చంద్రబాబును కక్షతోనే జైలుకు పంపించారని ఇటువంటి ప్రభుత్వానికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు రమేష్ కుమార్, గంగాధర్, చిన్నా రెడ్డి, రామాంజినమ్మ, జెపికె రాము, నెట్టప్ప, పరిమళ, రాము, దాదు, హిదయతుల్లా, కౌన్సిలర్లు మంజుళ, మహాలక్ష్మి, పెద్ద ఎత్తున టిడిపి నాయకులు పాల్గొన్నారు.
ధర్మవరంటౌన్ : టీడీపీ అధినేత నారాచంద్రబాబునాయుడు కోసం లాఠీదెబ్బలేకాదు ప్రాణత్యాగానికైన సిద్దమని నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జి పరిటాల శ్రీరామ్ పేర్కొన్నారు. బాబుతోనే నేను కార్యక్రమంలో భాగంగా రోజు గురువారం చేపట్టిన రిలే నిరాహారదీక్షలో తెలుగుమహిళలు పాల్గొన్నారు. దీక్షలో పాల్గొన్న మహిళలకు పరిటాల శ్రీరామ్ తోపాటు జనసేన పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి చిలకంమధుసూదన్‌రెడ్డి, సీపీఐ నాయకులు మద్దతు పలికారు. ఈ సందర్భంగా పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ సిల్ డెవలప్‌మెంట్‌లో చంద్రబాబు ఎలాంటి తప్పు చేయలేదన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా ధర్మవరంలో శాంతియుత నిరసన చేస్తుంటే పోలీసులు లాఠీచార్జ్ చేశారని, దీంతో అనేక మందికి గాయాలయ్యాయని అన్నారు. అయినప్పటికీ వెనక్కితగ్గేదిలేదన్నారు. ఈకార్యక్రమంలో నాయకులు కమతంకాటమయ్య, ఫణికుమార్, పురుషోత్తంగౌడ్, చింతపులుసు పెద్దన్న, భీమనేని ప్రసాద్‌నాయుడు, గరుగు వెంగప్ప, పరిశేసుధాకర్, నాగూరుస్సేన్, రాళ్లపల్లి షరీప్, కేశగాళ్ల శీన, రాంపురంశీన, గంగారపు రవి. బొట్టుకిష్ట, గోసలశ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.