Jul 30,2023 23:04

దీక్ష చేపడుతున్న నాయకులు, గిరిజనులు

ప్రజాశక్తి -కోటవురట్ల:అణుకు గిరిజన ప్రాంత ప్రజలకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆపేది లేదని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు అప్పలరాజు తేల్చి చెప్పారు. రిలే నిరాహార దీక్షలు ఆదివారం నాటికి 24 వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా దీక్షలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, జిల్లా కలెక్టర్‌ స్పందించి గ్రామానికి పాఠశాల, రహదారి సౌకర్యం కల్పించాలని డిమాండ్‌ చేశారు. గిరిజన ప్రాంతాన్ని ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన ప్రాంత ప్రజలు, మహిళలు, డేవిడ్‌రాజు, సూరిబాబు, రమేష్‌, కేశవరావు, సోమేశు, శ్రీరాము, రాజబాబు పాల్గొన్నారు.