ప్రజాశక్తి - బాపట్ల
వైసీపీ ప్రభుత్వం ప్రజల ప్రాథమిక హక్కులను కాలరాస్తూ, చట్టబద్దత లేకుండా రాజకీయ కక్షలకు పాల్పడుతోంని టిడిపి ఇన్చార్జి వేగేశన నరేంద్ర వర్మ అన్నారు. చంద్రబాబు అరెస్టు దారుణమని అన్నారు. విచారణ పేరుతో మానసిక ఒత్తిడికి గురిచేసి 24గంటలు దాటాక కోర్టుకు తీసుకువచ్చారని అన్నారు. విచారణ సమయంలో వీడియోలను సొంత మీడియా సంస్థలకు మాత్రమే విడుదల చేశారని అన్నారు. చట్టబద్ధత లేని ఇతర అధికారులు విచారణలో ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు. కేబినెట్ తీర్మానంతో అసెంబ్లీ ఆమోదంతో చేసిన బడ్జెట్ ఖర్చులపై క్రిమినల్ కేసులు వేయడం చట్టవిరుద్ధమన్నారు. అవినీతికి మారుపేరు, ఆర్థిక నెరస్థుడైన జగన్ మిగతా వారిని కూడా అదేవిధంగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్నారని అన్నారు. జగన్ ప్రభుత్వానికి ప్రజలే బుద్ది చెబుతారని అన్నారు.










