Nov 05,2022 21:50

            ముదినేపల్లి :అగ్రకులస్తుల దాడిలో గాయపడిన దళిత మహిళకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం రాష్ట్ర మహిళ కమిషన్‌ ఛైర్మన్‌ వాసిరెడ్డి పద్మను పలువురు కలిసి వినతిపత్రం అందచేశారు. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని పెయ్యేరు వైఎస్‌ఆర్‌ కాలనీకి చెందిన మొవ్వా సత్యవతి ఇటీవల అగ్రకులస్తుల దాడిలో తీవ్రంగా గాయపడింది. ఆసుపత్రిలో చికిత్స అనంతంర ఇటీవల ఇంటికి చేరింది. అయితే వికలాంగురాలైన సత్యవతిపై దాడిచేసి గాయపరచారని, ఆమెకు తగు న్యాయం చేయాలని కోరుతూ అమరావతినిలో రాష్ట్ర మహిళా కమిషన్‌ ఛైర్మన్‌ వాసిరెడ్డి పద్మను జై ఆంధ్ర సమాచార హక్కు చట్టం కమిటీ సభ్యులు వినతిపత్రం అందజేశారు. ఈ దాడిలో ఎంతటి వారైనా వదిలే ప్రసక్తేలేదని, దళిత మహిళకు తగు న్యాయం చేస్తామని పద్మ హామీ ఇచ్చినట్లు కమిటీ సభ్యులు బాపట్ల సుధీర్‌, మొవ్వ ఫణీంద్ర, పిల్లి గంగాధర్‌ తెలిపారు.