పట్టాలు చూపిస్తూ వినతి అందిస్తున్న గిరిజన రైతులు
ప్రజాశక్తి-పాచిపెంట : తమకు న్యాయం చేయాలని గొట్టూరు పంచాయతీ పొలంవలస గ్రామానికి చెందిన గిరిజన రైతులు సోమవారం గ్రీవెన్స్‌లో తహశీల్దార్ రాజశేఖర్‌కు వినతి అందించారు. ఐదో విడత భూ పంపిణీ కార్యక్రమంలో భాగంగా గ్రామానికి చెందిన 50 మంది గిరిజన రైతులు సాగు చేస్తున్న భూమికి డి-పట్టాలు అందజేశారని తెలిపారు. నాలుగు రోజుల క్రితం అటవీ శాఖ అధికారులు తమకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా, సాగు చేస్తున్న భూముల్లో మొక్కలు నాటి, సర్వేరాళ్లను పాతివేశారని వాపోయారు. స్పందించిన తహశీల్దార్ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కొటికిపెంట సర్పంచ్ ఇజ్జాడ అప్పలనాయుడు, గిరిజనులు పాల్గొన్నారు










