Nov 17,2023 23:22

ఎండిన వరి పంటను పరిశీలిస్తున్న జెడి శ్రీధర్‌

* జిల్లా వ్యవసాయశాఖ జెడి శ్రీధర్‌
ప్రజాశక్తి- మెళియాపుట్టి :
 క్షేత్రస్థాయిలో పరిశీలించి నష్టాన్ని ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని, అనంతరం రైతులకు న్యాయం చేసేలా చేస్తామని, రైతులెవరూ అధైర్య పడొద్దని జిల్లా వ్యవసాయశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ కె.శ్రీధర్‌ భరోసానిచ్చారు. ఈ సందర్భం గా మాట్లాడుతూ చిన్నసున్నాపురం, డేగలపోలూరు గ్రామాల్లో సాగునీరు, వర్షాభావ పరిస్థితుల్లో ఎండిన వరి పంట పొలాలను శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాస్థాయి లో ఎండిన పంటలపై ప్రాథమిక వివరాలు నమోదు చేసి ప్రభుత్వానికి నివేదించామని తెలిపారు. మెట్ట ప్రాంతాల్లో పాడైన పంటల్లో ప్రత్యామ్నా య పంటల వైపు మొగ్గు చూపాలని అన్నారు. రాగులు, పెసలు, మినుములు తదితరులు పంటలు వేసుకోవాలని సచించారు. పంట కోత ప్రయోగాల ద్వారా మీ ప్రాంతంలో పండే పంట సరాసరి దిగు బడిని అంచనా వేస్తున్నామని అన్నారు. దీని ద్వారా మీ పరిధిలో చాలా మంది రైతులకు వైఎస్‌ఆర్‌ క్రాప్‌ ఇన్స్యూరెన్స్‌ వచ్చే అవకాశం ఉందని అన్నారు. ఎండిన పంటలపై ప్రభుత్వ ఆదేశాలకు లోబడి తగు చర్యలు తీసుకుంటు న్నామని తెలిపారు. అనంతరం మెళియాపుట్టి రైతు భరోసా కేంద్రం పరిధిలో 50 శాతం రాయితీపై కట్టె జనుము విత్తనాలను పంపిణీ చేశారు. రైతులు ఎవరికైనా కావాలంటే మీ ప్రాం తాల్లోని ఆర్‌బికెల ద్వారా రిజిస్ట్రేషన్‌ చేసుకుంటే అందరికీ విత్తనాలు అందజేస్తామని చెప్పారు. పలాస వ్యవసాయ సహాయ సంచాలకులు మధుబాబు, మండల స్పెషల్‌ ఆఫీసర్‌ భవానీశంకర్‌, తహశీల్దార్‌ పి.సరోజని, మండల ఎఒ దానకర్ణుడు, మండల రెవెన్యూ ఇన్‌స్పెక్ట ర్‌ వైకుంఠరావు, సర్పంచ్‌ వెంకటేశు, గ్రామ వ్యవసాయ సహాయకులు శరత్‌కు మార్‌ రెడ్డి, షణ్ముఖరావు, త్రినాథరావు, గ్రామ రెవెన్యూ అధికారులు శామ్యూల్‌, రత్నం, సత్యనారాయణ పాల్గొన్నారు.