ప్రజాశక్తి - చింతలపూడి
విద్యార్థులలో నాయకత్వ లక్షణాలు పెంపొందించి, భావి భారత న్యాయ నిర్ణేతలుగా, నిజాయితీ పరులుగా తీర్చిదిద్దడానికి ఈ ఎన్నికలు ఎంతగానో ఉపయోగపడతాయని శ్రీచైతన్య స్కూల్ ప్రధానోపాధ్యాయులు టి.సురేష్ తెలిపారు. స్థానిక చింతలపూడి శ్రీచైతన్య పాఠశాలలో విద్యార్థులకు సాధారణ ఎన్నికలు రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తూ నిర్వహించారు. ఈ ఎన్నికల్లో హెడ్ బారు, హెడ్గాల్స్ స్పోర్ట్స్ కెప్టెన్, సిసిఎ కెప్టెన్, మొదలైన విభాగాల్లో ఎన్నికలు నిర్వహించడమైనది. విద్యార్థులు ఎన్నికల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల రీజనల్ ఇంఛార్జి పార్థసారథి, జోనల్ కోఆర్డినేటర్ ఉదయ భాస్కర్, డిన్ మధుబాబు, ఎఒ రవీంద్ర, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.










